IND vs ENG: టీమిండియా దెబ్బకు పాకిస్తాన్ ఢమాల్.. దిగజారిన ప్లేస్..

|

Jul 13, 2022 | 12:15 PM

ICC ODI Team Rankings: ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌ను ఓడించి వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్‌ను టీమిండియా అధిగమించింది. దీంతో పాకిస్తాన్ టీంకు భారీ షాక్ తగిలింది.

IND vs ENG: టీమిండియా దెబ్బకు పాకిస్తాన్ ఢమాల్.. దిగజారిన ప్లేస్..
Ind Vs Eng
Follow us on

ICC ODI Team Rankings: ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుంది టీమిండియా విజయం. అవును.. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో గెలిచిన రోహిత్ సేన.. ఇటు ఇంగ్లండ్‌తో పాటు అటు పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చింది. ఇంగ్లండ్ అంటే ఘోరంగా ఓడిపోయింది. ఓకే.. మరి పాకిస్తాన్‌కు ఏమైందని అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం.. ఐసీసీ వన్డే ర్యాకింగ్స్‌లో జరిగింది. ఓవల్ మైదానంలో టీమ్ ఇండియా(Team India) దెబ్బ పాకిస్తాన్ టీంకు కూడా తగిలింది.

ఓవల్ వేదికగా తొలి వన్డే ఆడకముందే టీమిండియా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ కంటే వెనుకంజలో నిలిచింది. పాకిస్థాన్ జట్టు మూడో స్థానంలో ఉండగా, భారత్ నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు, ఇంగ్లండ్ జట్టు రెండవ స్థానంలో ఉండగా, న్యూజిలాండ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. కానీ, ఓవల్‌ వేదికగా జరిగిన వన్డే ఫలితం తర్వాత వెలువడిన ర్యాకింగ్స్‌లో ఆయా జట్ల ర్యాకింగ్స్ మారిపోయాయి. న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ స్థానాల్లో ఎలాంటి మార్పు రాకపోగా.. భారత్‌, పాకిస్థాన్‌ స్థానాలో భారీ మార్పులు వచ్చాయి.

పడిపోయిన పాకిస్థాన్‌ ర్యాకింగ్..

ఇవి కూడా చదవండి

ఓవల్ వన్డేలో 10 వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా.. ఆ ప్రభావం ర్యాంకింగ్స్ పై ప్రభావం చూపింది. దీంతో పాక్‌ మూడో స్థానానికి పడిపోయింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ నాలుగో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం భారత్ రేటింగ్ పాయింట్లు 108, పాకిస్థాన్ 106 పాయింట్లతో నిలిచాయి. న్యూజిలాండ్ 126 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఇంగ్లండ్ 122 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

మిగిలిన 2 మ్యాచ్‌ల ఫలితాల ప్రభావం ఎలా ఉండనుందంటే?

ఇంగ్లండ్‌తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. దీంతో వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్‌ను అధిగమించింది. అయితే తర్వాతి రెండు మ్యాచ్‌ల ఫలితాలు అనుకూలంగా వస్తే లేదా? ఒకవేళ సిరీస్‌లో భారత్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేస్తే, ఆ సందర్భంలో టీమిండియా మొత్తం 113 రేటింగ్‌ పాయింట్లను సొంతం చేసుకుంటుంది. దీంతో మూడవ స్థానంలో కొనసాగే ఛాన్స్ ఉంది. కాగా పాకిస్థాన్ నాలుగో స్థానంలోనే ఉండిపోతుంది. అదే సమయంలో ఇంగ్లండ్ రేటింగ్ పాయింట్లు కూడా 117 కి తగ్గుతాయి. ఒకవేళ భారత్ సిరీస్‌ను 2-1తో గెలిస్తే, ఆ సందర్భంలో కూడా పాకిస్తాన్ కంటే ముందుంటుంది. అంటే 3వ స్థానంలోనే కొనసాగుతుంది. అయితే, రేటింగ్ పాయింట్లు 109కి పెరుగుతాయి.

అయితే, ఇంగ్లండ్ సిరీస్‌ను 2-1తో గెలిస్తే, ఆ సందర్భంలో పాకిస్థాన్ టీం భారత్‌ను వదిలి 3వ స్థానానికి చేరుకుంటుంది. ఎందుకంటే అప్పుడు పాకిస్థాన్‌కు 106 రేటింగ్ పాయింట్లు ఉంటే భారత్‌కు 105 రేటింగ్ పాయింట్లు ఉంటాయి.