Watch Video: తొలి ‘గోల్డ్ మెడల్’ గెలిచిన విరాట్ కోహ్లీ.. ఎందుకో తెలుసా? వైరల్ వీడియో..

|

Oct 09, 2023 | 5:08 PM

India vs Australia: ఇషాన్ కిషన్ (0), రోహిత్ శర్మ (0), శ్రేయాస్ అయ్యర్ (0) సున్నాకి అవుటవడంతో టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. అయితే విరాట్ కోహ్లీ (85), కేఎల్ రాహుల్ (97) 4వ వికెట్‌కు 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో 41.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసిన భారత్.. 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇదే ఆత్మ విశ్వాసంతో రెండో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది.

Watch Video: తొలి గోల్డ్ మెడల్ గెలిచిన విరాట్ కోహ్లీ.. ఎందుకో తెలుసా? వైరల్ వీడియో..
Virat Kohli Gold Medal
Follow us on

Virat Kohli Gold Medal Video: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 5వ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తదనుగుణంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారత బౌలర్ల ధాటికి తడబడింది. జస్ప్రీత్ బుమ్రా వేసిన మూడో ఓవర్ 2వ బంతికి మిచెల్ మార్ష్ బ్యాట్‌కు తగిలిన బంతి.. స్లిప్ వైపు వెళ్లింది. రెప్పపాటులో అద్భుత డైవింగ్ క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ.. టీమ్ ఇండియాకు తొలి విజయాన్ని అందించాడు.

అనంతరం స్పిన్నర్ల మాయకు తలొగ్గిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌటైంది. 200 పరుగుల సులువైన లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది.

ఇషాన్ కిషన్ (0), రోహిత్ శర్మ (0), శ్రేయాస్ అయ్యర్ (0) సున్నాకి ఔట్ కావడంతో భారీ షాక్ తగిలింది. అయితే విరాట్ కోహ్లీ (85), కేఎల్ రాహుల్ (97) 4వ వికెట్‌కు 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

చివరకు 41.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది.

కింగ్ కోహ్లీకి బంగారు పతకం..

ఈ విజయం తర్వాత, డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన సమావేశంలో విరాట్ కోహ్లీకి ప్రత్యేక గౌరవం లభించింది. ప్రపంచకప్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసే ఆటగాడికి బంగారు పతకం అందించే సంప్రదాయాన్ని టీమిండియా ప్రారంభించింది.

అందుకు తగ్గట్టుగానే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ఫీల్డింగ్‌తో టీమిండియా విజయానికి అన్ని విధాలా సహకరించిన విరాట్ కోహ్లి తొలి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. భారత ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కోహ్లీని బంగారు పతకంతో సత్కరించాడు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

భారత్ తదుపరి మ్యాచ్ ఎప్పుడు?

అక్టోబర్ 11న టీమిండియా రెండో మ్యాచ్ ఆడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ జట్టుతో భారత జట్టు తలపడనుంది.

ప్రపంచకప్‌లో బరిలో దిగే భారత జట్టు..

రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్.

టీం ఇండియా వన్డే ప్రపంచకప్ 2023 పూర్తి షెడ్యూల్ ఇదే..

అక్టోబర్ 8: భారత్ vs ఆస్ట్రేలియా – చెన్నై (6 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం)

అక్టోబర్ 11: భారత్ vs ఆఫ్ఘనిస్తాన్ – ఢిల్లీ

అక్టోబర్ 14: భారత్ vs పాకిస్థాన్ – అహ్మదాబాద్

అక్టోబర్ 19: భారత్ vs బంగ్లాదేశ్ – పూణె

అక్టోబర్ 22: భారత్ vs న్యూజిలాండ్ – ధర్మశాల

అక్టోబర్ 29: భారత్ vs ఇంగ్లండ్ – లక్నో

నవంబర్ 2: భారత్ vs శ్రీలంక – ముంబై

నవంబర్ 5: భారత్ vs దక్షిణాఫ్రికా – కోల్‌కతా

నవంబర్ 12: భారత్ vs నెదర్లాండ్స్ – బెంగళూరు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..