IND vs SL: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. గాయంతో దూరమై.. 5 నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన స్టార్ పేసర్..

Jasprit Bumrah: భారత స్టార్ బౌలర్ బుమ్రా సెప్టెంబర్ 2022 నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు. తన చివరి మ్యాచ్‌ను సెప్టెంబర్ 25న ఆస్ట్రేలియాతో ఆడాడు. ఆ తర్వాత వెన్ను గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.

IND vs SL: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. గాయంతో దూరమై.. 5 నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన స్టార్ పేసర్..
Jasprit Bumrah

Updated on: Jan 03, 2023 | 4:16 PM

Jasprit Bumrah, IND vs SL: భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు కొత్త సంవత్సరంలో శుభవార్త అందించాడు. చాలా కాలంగా టీమిండియాకు దూరమైన బుమ్రా.. త్వరలో మైదానంలో తన ఫాస్ట్ బౌలింగ్‌తో మైదానంలో దుమ్మురేపేందుకు వస్తున్నాడు. అతను పూర్తిగా ఫిట్‌గా మారాడు. దీంతో అతను తిరిగి భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. బుమ్రా పునరాగమనాన్ని మంగళవారం బీసీసీఐ ధృవీకరించింది. శ్రీలంకతో జరగనున్న 3 వన్డేల సిరీస్‌కు భారత సెలక్షన్ కమిటీ బుమ్రాను జట్టులోకి తీసుకుంది. జనవరి 10 నుంచి బుమ్రా యాక్షన్‌లో కనిపించనున్నాడు.

భారత స్టార్ బౌలర్ బుమ్రా సెప్టెంబర్ 2022 నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు. తన చివరి మ్యాచ్‌ను సెప్టెంబర్ 25న ఆస్ట్రేలియాతో ఆడాడు. ఆ తర్వాత వెన్ను గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దీంతో బుమ్రా టీ20 ప్రపంచకప్‌కు కూడా దూరమయ్యాడు.

ఇవి కూడా చదవండి

చాలా కాలంగా గాయంతో బాధపడుతున్న బుమ్రా నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసంలో ఉన్నాడు. అక్కడ బుమ్రా పూర్తిగా ఫిట్‌గా ఉన్నట్లు NCA ప్రకటించింది. త్వరలో జట్టులో చేరనున్నాడు. జనవరి 10 నుంచి 15 వరకు శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ప్రస్తుతం శ్రీలంకతో 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్ ఇండియా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..