IND vs NZ: రోహిత్, కోహ్లీకి బిగ్‌షాక్.. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు నో ఛాన్స్.. రీఎంట్రీ ఇచ్చిన ట్రిపుల్ సెంచరీ ప్లేయర్..

Team India: జనవరి 18 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఆ తర్వాత జనవరి 27 నుంచి ఇరు జట్లు 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనున్నాయి.

IND vs NZ: రోహిత్, కోహ్లీకి బిగ్‌షాక్.. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు నో ఛాన్స్.. రీఎంట్రీ ఇచ్చిన ట్రిపుల్ సెంచరీ ప్లేయర్..
Rohit Sharma Virat Kohli

Updated on: Jan 14, 2023 | 6:49 AM

India vs New Zealand: ఈ నెలలో న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) టీమ్ ఇండియాను ప్రకటించింది. ఈ సిరీస్‌లోనూ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను పక్కన పెట్టింది. కాగా, హార్దిక్ పాండ్యా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జనవరి 27 నుంచి మూడు టీ20ఐల సిరీస్ లో ఇరుజట్లు తలపడనున్నాయి.

కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ దూరం..

న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్, స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌లను ఎంపిక చేయలేదు. వ్యక్తిగత కారణాల వల్లే ఈ ఇద్దరు ఆటగాళ్లు అందుబాటులో లేరని బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది.

పృథ్వీ షా పునరాగమనం.. జితేష్ శర్మకూ అవకాశం..

న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో 29 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జితేష్ శర్మ టీమ్ ఇండియా రిజర్వ్ వికెట్ కీపర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. గతంలో సంజూ శాంసన్ గాయపడటంతో శ్రీలంకతో టీ20 సిరీస్‌లో కూడా అతనికి అవకాశం లభించింది. అదే సమయంలో టీమిండియా పునరాగమనంపై చాలా కాలంగా కసరత్తు చేస్తున్న ఓపెనర్ పృథ్వీ షాకు కూడా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో అవకాశం దక్కింది.

ఇవి కూడా చదవండి

రోహిత్-కోహ్లీ నో ఛాన్స్.. రవీంద్ర జడేజా అన్ ఫిట్..

టీ20 జట్టులోకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను బోర్డు మరోసారి ఎంపిక చేయలేదు. అయితే ఈ ఇద్దరు వెటరన్లను ఎంపిక చేయకపోవడానికి గల కారణాలను బీసీసీఐ వెల్లడించలేదు. అదే సమయంలో రవీంద్ర జడేజా కూడా ఫిట్‌గా లేడు. ఈ కారణంగా అతనికి జట్టులో చోటు దక్కలేదు.

న్యూజిలాండ్‌తో సిరీస్‌కు టీం ఇండియా – హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రీతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి, పృథ్వీ షా, ముఖేష్ కుమార్.

ఇండియా న్యూజిలాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్..

భారత్ vs న్యూజిలాండ్, 1వ టీ20 జనవరి 27 – రాంచీ

భారత్ vs న్యూజిలాండ్, 2వ టీ20 జనవరి 29 – లక్నో

ఇండియా vs న్యూజిలాండ్, 3వ టీ20 ఫిబ్రవరి 01 – అహ్మదాబాద్

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..