IND vs ENG: 7 ఏళ్ల తర్వాత చెపాక్‌లో టీ20ఐ ఆడనున్న భారత్.. ధోనీ షాక్ తిన్న చోట సూర్య రాణించేనా?

India vs England: భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టీ20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. చెన్నైలోని చెపాక్‌లో 7 ఏళ్ల తర్వాత భారత జట్టు ఆడనుంది. ఈ మ్యాచ్‌ ఇంగ్లండ్ జట్టుకు కీలకంగా మారింది. ఓడితే సిరీస్‌లో మరింత వెనుకంజ వేయాల్సి వస్తుంది. అయితే, కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌కు కూడా అంతే కీలకం మారింది. ఎందుకంటే ఈ మైదానంలో టీమ్ ఇండియా లెక్కలు అంత బాగోలేవు.

IND vs ENG: 7 ఏళ్ల తర్వాత చెపాక్‌లో టీ20ఐ ఆడనున్న భారత్.. ధోనీ షాక్ తిన్న చోట సూర్య రాణించేనా?
Ind Vs Eng 2nd T20i Records

Updated on: Jan 25, 2025 | 2:31 PM

India vs England: భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టీ20 మ్యాచ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ చెన్నైలోని చెపాక్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌ ఇంగ్లిష్‌ జట్టుకు డూ ఆర్‌ డైలా మారింది. అయితే, కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌కు కూడా అంతే కీలకంగా మారింది. ఎందుకంటే, ఈ మైదానంలో టీమిండియా లెక్కలు ఏకపక్షంగా లేవు. టీమిండియా మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా ఈ మైదానంలో ఒకసారి విఫలమయ్యాడు. ఏడేళ్ల తర్వాత ఈ మైదానంలో టీమిండియా టీ20 ఆడనుంది.

భారత జట్టు ఎన్ని టీ20లు ఆడింది?

భారత జట్టు చెపాక్‌లో ఇప్పటి వరకు 2 టీ20 మ్యాచ్‌లు ఆడింది. చివరిసారిగా 2018లో వెస్టిండీస్‌తో భారత జట్టు ఆడింది. ఆ మ్యాచ్‌లో భారత జట్టు ఉత్కంఠ విజయం సాధించింది. అయితే, అంతకు ముందు 2012లో న్యూజిలాండ్‌పై షాక్ తగిలింది. ఎంఎస్ ధోని సారథ్యంలో భారత జట్టు 1 పరుగు తేడాతో బాధాకరమైన ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ వంతు?

గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్ అయిన తర్వాత, సూర్యకుమార్ యాదవ్ టీ 20 ఫార్మాట్‌కు టీమిండియా శాశ్వత కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సూర్య అంచనాలకు తగ్గట్టుగానే ఉన్నాడు. గతేడాది నుంచి ఇప్పటి వరకు టీమిండియా విజయాల పరంపర కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ సిరీస్‌లో భారత జట్టు 1-0 ఆధిక్యంలో ఉంది. అయితే, రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు కూడా గెలవాలని కోరుకుంటోంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా గణాంకాలు ఎలా ఉన్నాయంటే?

ఇంగ్లండ్‌పై టీమిండియాదే పైచేయి కనిపిస్తోంది. కానీ, విజిటింగ్ టీమ్‌కి ఎప్పుడైనా మ్యాచ్‌ని మలుపు తిప్పే సత్తా ఉంది. ఇంగ్లిష్ టీమ్‌తో భారత్ ఇప్పటి వరకు 14 టీ20 మ్యాచ్‌లు గెలవగా, ఇంగ్లండ్ 11 సార్లు గెలిచింది. రెండో మ్యాచ్‌లో సూర్య సేన గెలిస్తే సిరీస్‌లో తిరుగులేని ఆధిక్యం సాధించనుంది.

2వ T20I కోసం ఇరు జట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ 11..

భారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, నితీష్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ షమీ/రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.

ఇంగ్లండ్: బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ (కీపర్), జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్‌టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..