IND vs SA 1st T20I: తొలి టీ20కి రంగం సిద్ధం.. టీమిండియా ప్లేయింగ్ 11 నుంచి ముగ్గురు ఔట్.. గంభీర్ ఫేవరేట్ కూడా?

IND vs SA 1st T20I: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య రేపు (డిసెంబర్ 9న) కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. కాగా, మొదటి టీ20 మ్యాచ్ కోసం భారత జట్టు ఆరుగురు బ్యాటర్లు, ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆ అంచనా ప్రకారం తుది జట్టు వివరాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

IND vs SA 1st T20I: తొలి టీ20కి రంగం సిద్ధం.. టీమిండియా ప్లేయింగ్ 11 నుంచి ముగ్గురు ఔట్.. గంభీర్ ఫేవరేట్ కూడా?
Ind Vs Sa 1st T20i Playing 11

Updated on: Dec 09, 2025 | 7:50 AM

India vs South Africa T20I Series: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య రేపు (డిసెంబర్ 9న) కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:00 గంటలకు జరగనుంది. ఈ కీలక పోరు కోసం టీమిండియా మేనేజ్‌మెంట్ తుది జట్టును ఎంపిక చేయడంలో కసరత్తు చేస్తోంది.

కాగా, మొదటి టీ20 మ్యాచ్ కోసం భారత జట్టు ఆరుగురు బ్యాటర్లు, ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆ అంచనా ప్రకారం తుది జట్టు వివరాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

ఓపెనింగ్, టాప్ ఆర్డర్:

ఇవి కూడా చదవండి

ఓపెనర్లు: ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. మెడ గాయం కారణంగా టెస్ట్ సిరీస్‌కు దూరమైన గిల్, ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌తో జట్టులోకి తిరిగి వచ్చాడు.

నెంబర్ 3: కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మూడవ స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు. కటక్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో సూర్య తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగే అవకాశం ఉంది.

మిడిల్ ఆర్డర్, ఆల్ రౌండర్లు:

నెంబర్ 4: యువ ఆటగాడు తిలక్ వర్మ ఈ స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.

నెంబర్ 5: స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఐదవ స్థానంలో వచ్చి బ్యాటింగ్, బౌలింగ్‌లో కీలక పాత్ర పోషించనున్నాడు.

నెంబర్ 6 (వికెట్ కీపర్): సంజూ శాంసన్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా జట్టులో కొనసాగుతాడు. ఫినిషర్ పాత్రలో శివమ్ దూబే, జితేష్ శర్మలకు చోటు దక్కకపోవచ్చు.

నెంబర్ 7: స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఏడవ స్థానంలో బ్యాటింగ్‌కు రావడమే కాకుండా, మూడవ పేసర్‌గా కూడా సేవలందించనున్నాడు.

బౌలింగ్ విభాగం:

స్పిన్నర్లు: కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా జట్టులో ఉండే అవకాశం ఉంది. దీంతో వాషింగ్టన్ సుందర్ బెంచ్‌కే పరిమితం కావచ్చు.

పేసర్లు: పేస్ దళాన్ని జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ నడిపిస్తారు. హర్షిత్ రాణాకు తుది జట్టులో చోటు దక్కే అవకాశం తక్కువగా ఉంది.

భారత తుది జట్టు (అంచనా): సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.