
IND vs PAK: భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే ఉత్కంఠభరిత మ్యాచ్ కోసం ఎదురుచూపులు ముగియబోతున్నాయి. ఫిబ్రవరి 23న దుబాయ్ మైదానంలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ రెండు జట్లు తలపడతాయి. రోహిత్-విరాట్ లేదా శుభ్‌మన్ బ్యాట్‌లు పాకిస్థాన్‌పై కాల్పులమోత మెగించేందుకు సిద్ధమవుతుండగా, మరోవైపు షమీ-రాణా, జడేజా- అక్సర్ తమ బౌలింగ్‌తో విధ్వంసం సృష్టించేందుకు ఎదురుచూస్తున్నారు. అయితే, టీం ఇండియాలోని ప్రతి ఆటగాడు పాకిస్థాన్‌పై ఏం చేస్తాడో కాలమే చెబుతుంది. కానీ, దానికి ముందు టీం ఇండియా ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్‌పైనా ఆసక్తి నెలకొంది. బిగ్ మ్యాచ్ కోసం భారత ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం..
కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు. బంగ్లాదేశ్‌పై గిల్ అజేయ సెంచరీ సాధించగా, రోహిత్ 41 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్తాన్‌పై అద్భుతమైన గణాంకాలు ఉన్న విరాట్ కోహ్లీ మూడో స్థానంలో నిలిచి జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయం. శ్రేయాస్ అయ్యర్ నాలుగో స్థానంలో కనిపిస్తాడు.
అక్షర్ పటేల్ బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అప్పర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. అతను పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదవ స్థానంలో కూడా బ్యాటింగ్ చేయగలడు. ఆ తర్వాత, వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్, ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా కనిపిస్తారు. జడేజా, అక్షర్, హార్దిక్ లు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ అద్భుతాలు చేయగలరు. ఎందుకంటే, ముగ్గురు ఆటగాళ్లు ఆల్ రౌండర్ పాత్రలో కనిపిస్తారు.
ఫాస్ట్ బౌలింగ్‌లో షమీ, రాణా ప్రధాన ఆకర్షణ..
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్షిత్ రాణా, మహ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేశారు. షమీ ఐదు వికెట్లు పడగొట్టగా, రాణా మూడు వికెట్లు పడగొట్టాడు. ఇటువంటి పరిస్థితిలో, మరోసారి పాకిస్థాన్‌పై ఫాస్ట్ బౌలింగ్ బాధ్యత వీరిద్దరి భుజాలపై పడుతుంది. కుల్దీప్ యాదవ్ ఆడటం కూడా ఖాయం. బంగ్లాదేశ్‌పై ఒక్క వికెట్ కూడా తీయకపోయినా, కుల్దీప్ కేవలం 4.30 ఎకానమీ రేటుతో పరుగులు ఇచ్చాడు.
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్-కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..