
India vs Pakistan Asia Cup 2025: ఆసియా కప్ 2025 (Asia Cup 2025) ఆరంభ మ్యాచ్ లో యూఏఈపై ఘన విజయం సాధించిన భారత జట్టు.. తదుపరి మ్యాచ్ లో పాకిస్తాన్‌తో (India vs Pakistan) హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తోంది. సూపర్ సండేలో భాగంగా జరగనున్న భారత్, పాక్ మ్యాచ్ కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 14న జరిగే ఈ మ్యాచ్ కోసం, టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందనేది అందరి ప్రశ్నగా మారింది. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం లభించింది. చిరకాల ప్రత్యర్థులపై టీమిండియా ఐదుగురు బ్యాటర్లు, ముగ్గురు ఆల్ రౌండర్లు, ముగ్గురు బౌలర్లతో మైదానంలోకి దిగుతుందని భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా అన్నారు.
అజయ్ జడేజా ప్రకారం, యూఏఈతో ఆడిన అదే భారత జట్టు పాకిస్తాన్ తో బరిలోకి దిగనుంది. అంటే, జట్టులో ఎటువంటి మార్పు ఉండదు. UAE తో మ్యాచ్ ప్రారంభానికి కొద్దిసేపటి ముందు అజయ్ జడేజా ఆసియా కప్ ప్రసార ఛానెల్ సోనీ నెట్‌వర్క్‌లో ఈ విషయం చెప్పుకొచ్చాడు.
యూఏఈతో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు ఆడబోయే ప్లేయింగ్ ఎలెవన్ గురించి చర్చిస్తున్న సందర్భంగా అజయ్ జడేజా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. యూఏఈతో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు 8 మంది బ్యాటర్లను ఆడించి ఉండాల్సింది కాదు. అయితే, జట్టులో 8 మంది బ్యాటర్లు ఉంచడంతో, అదే జట్టు పాకిస్తాన్ తో ఆడనుంది. అంటే, యూఏఈతో ఆడిన జట్టు పాకిస్తాన్ తో కూడా ఆడుతుందని అజయ్ జడేజా అభిప్రాయపడ్డారు.
బ్యాట్స్‌మెన్ – శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్)
ఆల్ రౌండర్లు- హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్
బౌలర్లు- కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి