India vs England: కఠోర సాధన చేస్తున్న టీమిండియా ప్లేయర్లు.. సిరీస్ లక్ష్యంగా సన్నాహాలు ముమ్మరం..
India vs England 4Th Match: ఇంగ్లండ్‌తో జరుగుతోన్న నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్ 2, ఇంగ్లండ్ 1 మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే. ఇక సిరీస్ ఎవరిదో నిర్ణయించే నాలుగో టెస్ట్ మ్యాచ్ అహ్మదాబాద్ మొటెరా వేదికగా..
India vs England 4Th Match: ఇంగ్లండ్‌తో జరుగుతోన్న నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్ 2, ఇంగ్లండ్ 1 మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే. ఇక సిరీస్ ఎవరిదో నిర్ణయించే నాలుగో టెస్ట్ మ్యాచ్ అహ్మదాబాద్ మొటెరా వేదికగా మార్చి 4 నుంచి మొదలు కానున్న విషయంతెలిసిందే.
ఈ నేపథ్యంలో సిరీస్‌పై కన్నేసిన భారత్ గెలుపే లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఈ క్రమంలోనే టీమిండియా ప్లేయర్లు కఠోర సాధన చేస్తున్నారు. సోమవారం జట్టు సభ్యులు ప్రాక్టిస్ చేసిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. జట్టులోని టాప్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, అజింక్య రహానే తీవ్రంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ ముగ్గురు బ్యాట్‌తో షాట్లు ఆడుతున్న వీడియోను బీసీసీఐ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆధ్వర్యంలో ఈ ప్రాక్టీస్ సెషన్ సోమవారం కొనసాగింది. ఇదిలా ఉంటే మూడో టెస్ట్ విషయంలో పిచ్ అంశంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. భారత్ కావాలనే స్పిన్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌లను రూపొందించుకుంటోందని వాదనలు వినిపించాయి. అయితే ఇవేవి పట్టించుకోవాల్సిన అవసరం లేదని భావించిన బీసీసీఐ నాలుగో టెస్ట్ మ్యాచ్ కోసం మరోసారి స్పిన్ పిచ్‌నే సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బోర్డు సూచనల ఆధారంగా నాలుగో టెస్టులోనూ స్పిన్ పిచ్ అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. మరి విజయాన్ని నిర్ణయించబోయే ఈ మ్యాచ్‌లో భారత జట్టు తన జోరును కొనసాగిస్తుందా.. లేదా ఇంగ్లాండ్ సిరీస్‌ను సమం చేస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
బీసీసీఐ ట్వీట్ చేసిన వీడియో..
Training ✅@Paytm #INDvENG pic.twitter.com/G7GCV1EA8U
— BCCI (@BCCI) March 1, 2021
Also Read: India Vs England: విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం.. రోహిత్ శర్మతో పాటు ఆ ఇద్దరూ వన్డేలకు దూరం..