
Shubman Gill Health Update: ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 (ఐసీసీ ప్రపంచ కప్ 2023) లో ఆఫ్ఘనిస్తాన్‌పై గెలిచిన తర్వాత , టీమ్ ఇండియా (India Vs Afghanistan) ఇప్పుడు తన తదుపరి మ్యాచ్‌కు సన్నాహాలు ప్రారంభించింది. అక్టోబరు 14న, రోహిత్ సేన హై-వోల్టేజ్ పోరులో (India vs Pakistan) పాకిస్థాన్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ కోసం బాబర్ సైన్యం ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకుంది. టీం ఇండియా కూడా అహ్మదాబాద్ చేరుకుంది. ఇంతలో, టీమిండియా శిబిరం నుంచి శుభవార్త వచ్చింది. డెంగ్యూ కారణంగా జట్టుకు దూరమైన యువ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ ఇప్పుడు జట్టులో చేరడానికి అహ్మదాబాద్‌లో అడుగుపెట్టాడు.
టీమ్ ఇండియా ప్రపంచకప్ ప్రచారాన్ని ప్రారంభించే ముందు శుభ్‌మాన్ గిల్ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో అతడిని తొలి 2 మ్యాచ్‌ల నుంచి తప్పించారు. తదుపరి చికిత్స కోసం గిల్‌ను కూడా ఆసుపత్రిలో చేర్చారు. అయితే, కొన్ని గంటల తర్వాత డిశ్చార్జి అయ్యాడు.
So the @ShubmanGill reached Ahemdabad ,hope he will be fine soon and deliver good news asap #WorldCup2023 pic.twitter.com/f7NC1JR1KU
— vipul kashyap (@kashyapvipul) October 11, 2023
ఇప్పుడు నివేదించిన ప్రకారం, శుభమాన్ గిల్ ఆరోగ్యంగా ఉన్నాడు. అహ్మదాబాద్‌లో అడుగుపెట్టాడు. అయితే గిల్ కోలుకున్నప్పటికీ.. గురువారం మాత్రం ప్రాక్టీస్ చేయడని వార్తలొస్తున్నాయి. అలా అయితే పాకిస్థాన్‌తో ఆడటం కష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే అతని స్థానంలో ఆడుతున్న ఇషాన్ కిషన్ ఆఫ్ఘనిస్థాన్ పై చక్కటి ప్రదర్శన చేశాడు. అలాగే గిల్‌తో జట్టు మేనేజ్‌మెంట్ ఎలాంటి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. అందుకే పూర్తిగా కోలుకున్న తర్వాతే జట్టులో ఆడాలని గిల్ నిర్ణయించుకున్నాడు. ఒకవేళ గిల్ పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో లేని పక్షంలో అతని స్థానంలో ఇషాన్ కిషన్ మరోసారి చోటు దక్కించుకుంటాడు.
గిల్ జట్టుతో చేరడానికి అహ్మదాబాద్‌లో అడుగుపెట్టాడు. విమానాశ్రయంలో పాకిస్తాన్‌తో ఆడటానికి మీరు ఫిట్‌గా ఉన్నారా? అని విలేకరి అడిగాడు. శుభమాన్ గిల్ ఎలాంటి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాడు.
ప్రపంచకప్‌నకు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్ , సూర్యకుమార్ యాదవ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..