
ICC ODI World Cup 2023, India vs New Zealand: ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (HPCA) స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాడు శుభ్‌మాన్ గిల్ వన్డే ఇంటర్నేషనల్స్‌లో వేగంగా 2,000 పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు . ఈ మ్యాచ్‌కి ముందు అతను మైలురాయికి కేవలం 14 పరుగుల దూరంలో నిలిచాడు.
ఇటీవల సెప్టెంబరులో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికైన గిల్.. హషీమ్ ఆమ్లా ఫీట్‌ను బ్రేక్ చేస్తూ కేవలం 38 ఇన్నింగ్స్‌లలో ఈ మార్కును చేరుకున్నాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్ 2011లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 ఇన్నింగ్స్‌లలో ఈ మార్కును చేరుకున్నాడు.
ప్రపంచకప్ 21వ మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారత్‌కు 274 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. నంబర్-4 వద్ద బ్యాటింగ్‌కు వచ్చిన డారిల్ మిచెల్ (130) సెంచరీ ఆడగా, రచిన్ రవీంద్ర (75 పరుగులు) అర్ధ సెంచరీతో రాణించాడు. గ్లెన్ ఫిలిప్స్ 23 పరుగులు చేశాడు. మహ్మద్ షమీ 5 వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశాడు. మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా కూడా ఒక్కో వికెట్ సాధించారు.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కీపర్/కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..