Team India: ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. రెండ్ బాల్ క్రికెట్ నుంచి శ్రేయాస్ అయ్యర్ రిటైర్మెంట్..?

Team India Player Shreyas Iyer: గత ఒకటిన్నర సంవత్సరాలుగా భారత టెస్ట్ జట్టుకు దూరంగా ఉన్న అయ్యర్, ఈసారి వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉందని భావించారు. కానీ, అంతా ఊహించని బిగ్ షాక్ ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Team India: ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. రెండ్ బాల్ క్రికెట్ నుంచి శ్రేయాస్ అయ్యర్ రిటైర్మెంట్..?
Shreyas Iyer

Updated on: Sep 23, 2025 | 9:39 PM

Team India: క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్. టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ టెస్ట్ క్రికెట్ నుంచి తాత్కాలికంగా విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అతను బీసీసీఐని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, ఈ వార్త నిజమైతే, భారత టెస్ట్ జట్టుకు ఇది ఒక ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు.

ఎందుకీ నిర్ణయం?

అయ్యర్ టెస్ట్ క్రికెట్ నుంచి విరామం తీసుకోవాలని ఎందుకు కోరుకుంటున్నాడనే దానిపై స్పష్టమైన కారణాలు లేవు. కానీ, గత కొంత కాలంగా అతని ఫామ్ సరిగా లేకపోవడం, తరచుగా గాయాల బారిన పడడం ఈ నిర్ణయానికి కారణాలు కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా అతని వెన్నునొప్పి సమస్యలు అతడిని టెస్ట్ ఫార్మాట్ నుంచి దూరం చేసి ఉండొచ్చు.

కెరీర్‌పై ప్రభావం?

గతంలో కూడా గాయాల కారణంగా అయ్యర్ జట్టుకు దూరమయ్యాడు. ఆ సమయంలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా కోల్పోయాడు. కానీ ఇటీవల ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అద్భుతంగా రాణించి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఈ ప్రదర్శనతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. అయితే, ఐపీఎల్‌లో ఆడిన తర్వాత ఆసియా కప్, వెస్టిండీస్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లకు కూడా అతనికి జట్టులో చోటు దక్కలేదు. దీంతో శ్రేయాస్ అయ్యర్ భవిష్యత్తుపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి

భవిష్యత్తుపై సందేహాలు..

అయ్యర్ టెస్ట్ క్రికెట్ నుంచి విరామం తీసుకోవాలనుకుంటున్న విషయం నిజమైతే, అది అతని కెరీర్‌కు ఒక పెద్ద మలుపు కావొచ్చు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ లాంటి యువ ఆటగాళ్లు టెస్ట్ జట్టులో తమ స్థానాన్ని పదిలం చేసుకుంటున్న సమయంలో శ్రేయస్ అయ్యర్‌కు ఈ విరామం మరిన్ని సవాళ్లను ఎదుర్కోవడానికి దారితీయవచ్చు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అద్భుతంగా రాణించినప్పటికీ, అతను తిరిగి టెస్ట్ ఫార్మాట్‌లో జట్టులోకి రావాలంటే కష్టపడాల్సిన అవసరం ఉంది. అయితే, అయ్యర్‌లాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి వస్తే భారత జట్టుకు మరింత బలం చేకూరడం ఖాయం.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..