Cricket: 6 సిక్సులు, 9 ఫోర్లు.. 183 స్ట్రైక్‌రేట్‌తో తుఫాన్ సెంచరీ.. టీమిండియా ఓపెనర్ సంచలన ఇన్నింగ్స్..

|

Aug 24, 2022 | 10:00 AM

Maharaja T20 Trophy: మహారాజా టీ20 ట్రోఫీ క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ 6 సిక్సర్లు, 9 ఫోర్లతో 112 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ 183 కంటే ఎక్కువగా ఉంది.

Cricket: 6 సిక్సులు, 9 ఫోర్లు.. 183 స్ట్రైక్‌రేట్‌తో తుఫాన్ సెంచరీ.. టీమిండియా ఓపెనర్ సంచలన ఇన్నింగ్స్..
Maharaja T20 Trophy Mayank Agarwal
Follow us on

Mayank Agarwal: ఆసియా కప్ 2022 శనివారం నుంచి ప్రారంభం కానుంది. అయితే అంతకుముందే ఓ భారత ఓపెనర్ చెలరేగిపోయాడు. వేగవంతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టి, బౌలర్ల భరతం పట్టడమే కాకుండా, భారీ ఇన్నింగ్స్‌లతో దూసుకపోతున్నాడు. అది కూడా ఒక ముఖ్యమైన మ్యాచ్‌లో, భారీ ఓటమితో దశలో జట్టు కూరుకపోయినప్పుడు, కీలక ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు. దీంతో ఆ జట్టుకు 44 పరుగుల విజయం దక్కింది. బెంగళూరు బ్లాస్టర్స్ విజయానికి మయాంక్ అగర్వాల్ బ్యాట్ కారణమైంది. కర్ణాటకలో జరుగుతున్న మహారాజా టీ20 ట్రోఫీ క్వాలిఫయర్ 1 లో ఈ తుఫాన్ ఇన్నింగ్స్ చోటు చేసుకుంది.

మహారాజా టీ20 ట్రోఫీని గెలుచుకునే బలమైన పోటీదారుల్లో బెంగళూరు బ్లాస్టర్స్ ఒకటిగా నిలిచింది. ఆ జట్టు కెప్టెన్ అంటే మయాంక్ అగర్వాల్ ఆటతో మరింత బలాన్ని పొందింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు మయాంక్ ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చాడు. అందులో ఒకటి గుల్బర్గ్ మిస్టిక్‌పై క్వాలిఫయర్ 1లో సెంచరీ అగ్రస్థానంలో ఉంది.

మయాంక్ బ్యాట్‌తో అదరగొట్టాడు..

ఇవి కూడా చదవండి

ఈ మ్యాచ్‌లో బెంగళూరు బ్లాస్టర్స్ మొదట బ్యాటింగ్ చేసింది. దీని కోసం మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ కమాండ్‌ని స్వీకరించాడు. మయాంక్ చేతన్‌తో కలిసి ఓపెనింగ్ వికెట్‌కు 15.5 ఓవర్లలో 162 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యంలో చేతన్ 80 పరుగులు చేసిన తర్వాత ఔట్ అయినప్పటికీ మయాంక్ మాత్రం అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు.

మయాంక్ అద్భుత సెంచరీ చేశాడు. మ్యాచ్‌లో 61 బంతులు ఎదుర్కొని 112 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 9 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. అతని స్ట్రైక్ రేట్ 183 కంటే ఎక్కువగా ఉంది.

మయాంక్ అగర్వాల్ జట్టు 44 పరుగుల తేడాతో విజయం..

మయాంక్ సెంచరీ ఫలితంగా బెంగళూరు బ్లాస్టర్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ఇప్పుడు గుల్బర్గ్ మిస్టిక్ వద్ద 228 పరుగుల లక్ష్యం ఉంది. కానీ, ఆ జట్టు ఇన్నింగ్స్ 183 పరుగుల వద్ద ముగిసింది. ఈ మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో ఓడిపోయింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌లో మయాంక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.