IND vs ENG: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఓడిపోయిన భారత్‌కు మరోషాక్ తగిలింది. పేసర్ ఇషాంత్ శర్మ గాయపడడంతో ఇంగ్లండ్ సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అనేది తెలియడం లేదు. న్యూజిలాండ్ తో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రెండో ఇన్నింగ్స్‌లో తన బౌలింగ్‌లోనే గాయపడ్డాడు. ఓ బంతిని ఆపే క్రమంలో ఇషాంత్ చేతి వేళ్లకు గాయాలయ్యాయి. తీవ్రంగా రక్తస్రావం కావడంతో వెంటనే అతను మైదానాన్ని వీడాడు. అతడి కుడి చేతి మధ్య వేళ్లకు గాయాలయ్యాయని, కుట్లు కూడా పడ్డాయని తెలుస్తోంది. దీంతో త్వరలో ప్రారంభమయ్యే ఇంగ్లండ్ సిరీస్ ఆడే ఛాన్స్ లేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇషాంత్ శర్మ విషయమై బీసీసీఐ మాత్రం పాజిటివ్‌గానే ఉందంట. తొలి టెస్ట్ లోపు కోలుకుంటాడని అభిప్రాయపడుతోంది. డబ్ల్యూటీసీ ఫైనల్ రెండో ఇన్నింగ్స్‌లో తన బౌలింగ్‌లోనే ఓ బంతిని ఆపే క్రమంలో ఇషాంత్ గాయపడ్డాడు. అతని చేతి వేళ్లకు గాయాలయ్యాయి. తీవ్రంగా రక్తస్రావం కావడంతో వెంటనే అతను మైదానాన్ని వీడాడు.
ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి, తొలి ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకుంది. అయితే, త్వరలో ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్ట్‌కు దాదాపు ఆరు వారాల సమయం ఉంది. ఆలోగా ఇషాంత్ శర్మ కోలుకుంటాడని బీసీసీఐ అధికారులు తెలిపారు. టీమిండియాకు ప్రస్తుతం 20 రోజుల సమయం దొరికింది. ఈమేరకు బయోబుడలో నుంచి ఆటగాళ్లు విరామం ఇచ్చింది బీసీసీఐ. కుటుంబ సభ్యులతో కలిసి బ్రిటన్ లో చక్కర్లు కొట్టే అవకాశాన్ని కల్పించింది. ఈమేరకు గురువారం సాయంత్రమే టీమిండియా ఆటగాళ్లు లండన్ బయల్దేరారు. అయితే డెల్టా వేరియంట్ తో బ్రిటన్‌లో కేసులు వీపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తులు తీసుకోవాలని బీసీసీఐ సూచించింది. ఈ మేరకు భారత అభిమానులు ఇషాంత్ త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. అలాగే ఇంగ్లండ్ సిరీస్‌లో నీపాత్ర చాలా కీలకమని అంటున్నారు.
Ishant Sharma ?? will be very important for England ?? Tests. pic.twitter.com/srbcQCPPyS
— Sounak Manna (@SounakManna7) June 25, 2021
Get well soon, Ishant Sharma. Wish you a speedy recovery. pic.twitter.com/qqHIhDHnIj
— CricketMAN2 (@man4_cricket) June 24, 2021
It’s an injury that’s Ishant Sharma maintained his bowling in the hands of a number of stitches, but the senior speedster is expected to recover from as little as five days prior to the test series against England, which starts on the 4th of August.https://t.co/eWKVI0hiQJ pic.twitter.com/OVFEx4Islo
— RTD journal (@JournalRtd) June 24, 2021
Also Read:
Virat Kohli: భారత సారథిని అవమానించిన న్యూజిలాండ్ వెబ్‌సైట్; విరాట్ ఫ్యాన్స్ ఆగ్రహం!
IND vs ENG: ప్రాక్టీస్ లేకే దెబ్బతిన్నామా? ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ముందు బీసీసీఐ కీలక నిర్ణయం!
Sourav Ganguly: ‘సచిన్ అన్న మాటలు నాకింకా గుర్తున్నాయి’: 25 ఏళ్ల నాటి సంగతి గుర్తుచేసుకున్న గంగూలీ!
Kapil Dev: ఎప్పటికీ ఆ విజయమే వెరీ వెరీ స్పెషల్! ‘కపిల్స్ డెవిల్స్ ఆఫ్ 1983’ అంటూ ఫ్యాన్స్ సందడి