Team India New Captain: టీ20 సిరీస్ ఓటమి ఎఫెక్ట్.. హార్దిక్ సారథ్యంపై వేటు.. ఫ్యూచర్ కెప్టెన్ ఎవరంటే?

Team India Cricketer: రోహిత్ శర్మ తర్వాత టీమిండియాకు శాశ్వత వన్డే, టీ20 కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా బలమైన పోటీదారుగా పేర్కొన్నారు. అయితే వెస్టిండీస్‌తో జరిగిన T20 సిరీస్‌లో ఓటమితో అతని కెప్టెన్సీలోని భారీ తప్పులను బహిర్గతం చేసింది. దీంతో బీసీసీఐ కూడా ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్లుగా కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. ఆ లిస్టులో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం..

Team India New Captain: టీ20 సిరీస్ ఓటమి ఎఫెక్ట్.. హార్దిక్ సారథ్యంపై వేటు.. ఫ్యూచర్ కెప్టెన్ ఎవరంటే?
Hardik And Virat

Updated on: Aug 14, 2023 | 1:15 PM

Team India New Captain: రోహిత్ శర్మ తర్వాత టీమ్ ఇండియాకు శాశ్వత వన్డే, టీ20 కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా బలమైన పోటీదారుగా పేరుగాంచాడు. అయితే, వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఓటమి అతని పేలవమైన కెప్టెన్సీని బహిర్గతం చేసింది. ఈ ఏడాది భారత్‌లో జరగనున్న 2023 ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ తన రిటైర్మెంట్‌ను ప్రకటించడంతో పాటు టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మైదానంలో ధోనీలా నిర్ణయాలు తీసుకునే వన్డే, టీ20 కెప్టెన్‌ టీమ్‌ ఇండియాకు అవసరం. భారత్‌కు తదుపరి వన్డే కెప్టెన్‌గా మారగల ముగ్గురు ఆటగాళ్లను ఓసారి చూద్దాం..

హార్దిక్ పాండ్యాపై ట్రోల్స్..

1. రిషబ్ పంత్..

టీమ్‌ఇండియా కొత్త వన్డే కెప్టెన్‌గా ఎంపికయ్యే బలమైన పోటీదారుల్లో రిషబ్ పంత్ ఒకరు. ప్రస్తుతం ప్రమాదం తర్వాత రిషబ్ పంత్ తిరిగి టీమ్ ఇండియాకు రావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. రిషబ్ పంత్ కెప్టెన్సీలో మహేంద్ర సింగ్ ధోనీ గ్లింప్స్ కూడా కనిపిస్తాయి. 25 ఏళ్ల యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ చాలా కాలం పాటు భారత వన్డేలకు కెప్టెన్‌గా ఉండే శక్తిని కలిగి ఉన్నాడు. రిషబ్ పంత్ భారతదేశపు అతిపెద్ద మ్యాచ్ విన్నర్. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా రిషబ్ పంత్ అద్భుతమైన ఆటతీరును చూస్తుంటే, అతను భారత తదుపరి వన్డే కెప్టెన్‌గా మారవచ్చు.

జిమ్ లో రిషబ్ పంత్ కసరత్తులు..

2. శుభమాన్ గిల్..

23 ఏళ్ల వయసులో టెస్టు, వన్డే, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. శుభ్‌మాన్ గిల్‌కు వన్డే క్రికెట్‌లో చాలా ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఇటువంటి పరిస్థితిలో అతను చాలా కాలం పాటు టీమిండియాకు ఓపెనర్‌గా ఉంటూనే, కెప్టెన్సీ పాత్రను కూడా పోషించగలడు. శుభ్‌మన్ గిల్ రాబోయే 10 నుండి 15 సంవత్సరాల పాటు భారతదేశం తరపున క్రికెట్ ఆడగలడు. కెప్టెన్‌గా కూడా ఉండగలడు.

శుభమాన్ గిల్ బ్యాటింగ్..

3. శ్రేయాస్ అయ్యర్..

శ్రేయాస్ అయ్యర్‌ను భారత తదుపరి వన్డే కెప్టెన్‌గా చేస్తే జట్టు చాలా లాభపడుతుంది. టీమ్ ఇండియా ప్రతిభావంతులైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా భారత తదుపరి వన్డే కెప్టెన్‌గా మారడానికి అతిపెద్ద పోటీదారుడుగా ఉన్నాడు. ముంబైకి చెందిన 28 ఏళ్ల బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ 2017 సంవత్సరంలో భారత జట్టు కోసం తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించాడు. కెప్టెన్సీ గురించి మాట్లాడితే, అయ్యర్ IPL 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా నియమితులయ్యాడు. ఆ తర్వాత, IPL 2020లో, అతని కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఫైనల్ వరకు ప్రయాణించింది. IPL 2022 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ శ్రేయాస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా చేసింది. ఇది అతనికి టీమ్ ఇండియా కెప్టెన్‌గా అవకాశాలను కూడా తెరిచింది.

శ్రేయాస్ అయ్యర్ ప్రాక్టీస్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..