Sanju Samson: భారత జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ గురించిన ఒక వార్త సోషల్ మీడియాలో చాలా వేగంగా వ్యాపిస్తోంది. సంజూ శాంసన్‌కి ఐర్లాండ్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడే ఆఫర్ వచ్చిందని ఆ వార్తల్లో చెప్పుకుంటున్నారు. అసలు ఆ వార్తలో విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. అలాగే ఐర్లాండ్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి అవసరమైన షరతు ఏంటి, ఐర్లాండ్ తరపున ఏ ఆటగాడు అంతర్జాతీయంగా ఆడనున్నాడో కూడా తెలుసుకుందాం..
అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడేందుకు సంజూకు ఐర్లాండ్ నుంచి ఆఫర్ వచ్చిందని, అతను ఆ ఆఫర్‌ను తిరస్కరించాడని ఆ నివేదికల్లో పేర్కొంది. ఐర్లాండ్ నుంచి అంతర్జాతీయ మ్యాచ్‌లలో సంజు ప్రతి మ్యాచ్ ఆడతాడని కూడా ఆ నివేదికలలో పేర్కొన్నారు.
తమ వైపు నుంచి సంజూ శాంసన్‌కు అలాంటి ఆఫర్ ఏమీ రాలేదని ఐర్లాండ్ క్రికెట్ పూర్తిగా ఖండించింది. ఐర్లాండ్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి కొన్ని షరతులు, నియమాలు ఉన్నాయి. షరతు ప్రకారం, మూడేళ్లపాటు ఐర్లాండ్‌లో దేశవాళీ క్రికెట్ ఆడనంత వరకు ఏ ఆటగాడు ఐర్లాండ్ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడకూడదు. ఇటువంటి పరిస్థితిలో, ఈ నివేదికలు ఏ విధంగానూ నిజం కావని తెలుస్తోంది.
వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్‌కు భారత జట్టు చాలా తక్కువ అవకాశాలను ఇస్తోందని, దాని కారణంగా ఇలాంటి వార్తలు ఊపందుకుంటున్నాయని తెలుస్తోంది. విశేషమేమిటంటే, సంజు 2015లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి భారత్ తరపున 27 అంతర్జాతీయ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. బంగ్లాదేశ్ టూర్‌లో సంజూని కూడా చేర్చలేదు. ఇంతకు ముందు కూడా అతను చాలా సందర్భాలలో జట్టుకు దూరంగా ఉన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..