Team India: ఒక్క సంతకంతో రూ.125 కోట్లు.. ‘దాదాగిరి’తో రూటు మార్చిన టీమిండియా మాజీ కెప్టెన్

Sourav Ganguly Rs 125 crore Deal: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 2021లో తొలిసారిగా ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్ అయ్యాడు. ఈ ఏడాది ఆ పదవికి తిరిగి ఎన్నికయ్యాడు. 2021 సంవత్సరంలో అనిల్ కుంబ్లే స్థానంలో గంగూలీ ఈ పాత్రలో నియమితులయ్యారు.

Team India: ఒక్క సంతకంతో రూ.125 కోట్లు.. దాదాగిరితో రూటు మార్చిన టీమిండియా మాజీ కెప్టెన్
Sourav Ganguly

Updated on: Apr 23, 2025 | 11:44 AM

Sourav Ganguly Rs 125 crore Deal: ఇటీవలే ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా తిరిగి నియమితులైన సౌరవ్ గంగూలీకి ఇప్పుడు రూ.125 కోట్లు అందనున్నాయి. అతను తన కొత్త ఒప్పందంతో ఈ డబ్బును పొందనున్నాడు. దీంతో ‘దాదాగిరి’ని వదులుకోవలసి వస్తోంది. సౌరవ్ గంగూలీ హోస్ట్ చేసిన బెంగాలీ క్విజ్ షో పేరు ‘దాదాగిరి’. ఓ నివేదిక ప్రకారం, గంగూలీ స్టార్ జల్షాతో రూ.125 కోట్ల ఒప్పందంపై సంతకం చేసినట్లు తెలుస్తోంది.

స్టార్ జల్షాతో 125 కోట్ల ఒప్పందం..

బెంగాలీ టెలివిజన్‌లో ‘దాదాగిరి’ అనే క్విజ్ షోను నిర్వహించిన తర్వాత, సౌరవ్ గంగూలీ బెంగాల్‌లోని ప్రతి ఇంటికి చేరాడు. నివేదిక ప్రకారం, ఇప్పుడు స్టార్ జల్సా అతని ప్రజాదరణను క్యాష్ చేసుకోవాలనుకుంటోంది. ఎందుకంటే, గంగూలీతో 4 సంవత్సరాల ఒప్పందంపై రూ.125 కోట్లకు సంతకం చేసింది. ప్రతిగా, గంగూలీ బిగ్ బాస్ బంగ్లాకు హోస్ట్‌గా వ్యవహరించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అంతే కాకుండా, ఆ ఛానెల్ కొత్త క్విజ్ షోను కూడా తీసుకురాబోతోందంట. ఈ రెండు షోలు వచ్చే ఏడాది నుంచి ప్రసారం కానున్నాయి. వీటి నిర్మాణ పనులు జులై 2025 నుంచి ప్రారంభమవుతాయి.

కొత్త ఒప్పందంతో సంతోషంగా సౌరవ్ గంగూలీ – నివేదిక

ఆ నివేదికలో, సౌరవ్ గంగూలీ తన కొత్త ఒప్పందంతో సంతోషంగా ఉన్నానని చెప్పినట్లు పేర్కొన్నారు. స్టార్ జల్షాతో అనుబంధం కలిగి ఉండటం ఆయనకు సంతోషంగా ఉంది. తాను, స్టార్ జల్షా ఇప్పుడు కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తామని, ఇది నాన్-ఫిక్షన్ కార్యక్రమాలపై దృష్టి సారిస్తుందని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

క్రికెట్‌కు అతీతంగా ప్రజలతో కనెక్ట్ అవ్వడం తనకు ఎప్పుడూ ఇష్టమని గంగూలీ అన్నారు. స్టార్ జల్షాతో ఈ అవకాశం మరింత లభిస్తుంది. ప్రజలను ప్రభావితం చేసిన నిజ జీవిత కథలను ఎదుర్కొనే అవకాశం లభిస్తుందని తెలిపారు.

భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 2021లో తొలిసారిగా ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్ అయ్యాడు. ఈ ఏడాది ఆ పదవికి తిరిగి ఎన్నికయ్యాడు. 2021 సంవత్సరంలో అనిల్ కుంబ్లే స్థానంలో గంగూలీ ఈ పాత్రలో నియమితులయ్యారు.

సౌరవ్ గంగూలీ భారతదేశం తరపున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడాడు. ఇందులో అతను 18000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో గంగూలీ 38 సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..