Jasprit Bumrah: ఈ బుమ్రా.. వుమ్రాలు ఏం చేయలేరు.. సంచలన వ్యాఖ్యలు చేసిన కోహ్లీ.. ఎందుకో తెలుసా?

|

Jul 13, 2022 | 1:22 PM

కోహ్లి మాటలను బుమ్రా తప్పని నిరూపించాడు. జనవరి 2016లో బుమ్రా తన ODI, T20 అరంగేట్రం చేశాడు. బుమ్రా 2018 నుంచి భారత టెస్టు జట్టులో సభ్యుడిగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.

Jasprit Bumrah: ఈ బుమ్రా.. వుమ్రాలు ఏం చేయలేరు.. సంచలన వ్యాఖ్యలు చేసిన కోహ్లీ.. ఎందుకో తెలుసా?
Virat Kohli Vs Bumrah
Follow us on

మీరు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సినిమాల అభిమాని అయితే, తుఫాను దేవుడు థోర్ మీ హృదయాన్ని తప్పక గెలుచుకుంటాడు. చేతిలో సుత్తి ఉన్నప్పుడే థోర్ మహిమలు కనిపిస్తాయి. అచ్చం అలాగే భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) కథ కూడా.. అదేంటి ఇలా పోల్చారు అని ఆలోచిస్తున్నారా.. ఇంకెదుకు ఆలస్యం అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం.. బుమ్రా స్వతహాగా చాలా సిగ్గు పడే వ్యక్తి. ఆయన మాటల్లో, ప్రవర్తనలో దూకుడు ఎక్కడా కనిపించదు. కానీ, అతని చేతిలో బంతి విసిరినప్పుడు మాత్రం పరిస్థితి వేరేలా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ బ్యాట్స్‌మెన్ అతడిని ఎదుర్కోవాలంటే భయపడుతున్నారు. తాజాగా మంగళవారం ఓవల్ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్(IND vs ENG) జట్టు బుమ్రా ఆగ్రహానికి గురైంది. బుమ్రా 19 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఇది బుమ్రా కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్‌గా నిలిచిపోతుంది. ఈ మ్యాచ్‌లో 19 ఏళ్ల రికార్డును కూడా బుమ్రా బద్దలు కొట్టాడు. అయితే, ఈ రికార్డ్‌ గురించి మనం ఇది వరకే చెప్పుకున్నాం. కానీ, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా పేరును మొదటిసారి విన్నప్పుడు జరిగిన సంఘటన గురించి తెలిస్తే మాత్రం తప్పకుండా ఆశ్చర్యపోతారు.

ఇది 2014లో జరిగి సంఘటన. పార్థివ్ పటేల్ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. బలమైన ఫాస్ట్ బౌలర్ కోసం RCB తీవ్రంగా జల్లెడ పడుతోంది. ఈ సమయంలో విరాట్ కోహ్లీ ముందు బుమ్రా పేరును పార్థివ్ ప్రస్తావించాడు. గుజరాత్ తరపున బుమ్రా ఆడటం చూశాడు. కానీ, విరాట్ మాత్రం బుమ్రా ప్రదర్శనపై పెద్దగా ఆసక్తి చూపలేదు. కోహ్లికి అంతగా నచ్చలేదు. దీంతో పార్థివ్‌తో మాట్లాడుతూ- ఆ మనిషిని విడిచిపెట్టు. ఈ బుమ్రా-వుమ్రాలు ఏం చేస్తారు? అంటూ కామెంట్ చేశాడంట.

కానీ, కోహ్లి మాటలను బుమ్రా తప్పని నిరూపించాడు. జనవరి 2016లో బుమ్రా తన ODI, T20 అరంగేట్రం చేశాడు. బుమ్రా 2018 నుంచి భారత టెస్టు జట్టులో సభ్యుడిగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అప్పటి నుండి అతను ఒకదాని తరువాత ఒకటి అనేక విజయాలను తన కెరీర్‌లో లిఖించుకుంటూ వచ్చాడు. మచ్చుకు కొన్ని చూద్దాం..

ఇవి కూడా చదవండి

వన్డేల్లో 100+ వికెట్లు తీసిన భారత బౌలర్లలో అత్యుత్తమ సగటు..

బుమ్రా వన్డే క్రికెట్‌లో 71 మ్యాచ్‌లలో 119 వికెట్లు పడగొట్టాడు. అతను కేవలం 24.30 సగటుతో ఈ వికెట్లు తీశాడు. అంటే, ప్రతి వన్డే వికెట్‌కు అతను 25 పరుగుల కంటే తక్కువ వెచ్చించాడు. వన్డేల్లో 100+ వికెట్లు తీసిన మరే భారత బౌలర్‌కు ఇంత గొప్ప సగటు లేకపోవడం విశేషం.

ఎకానమీ రేట్‌లో అత్యుత్తమం..

బుమ్రా వన్డేల్లో ఓవర్‌కు 4.63 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కపిల్ దేవ్ ఎకానమీ రేటు కంటే మెరుగ్గా ఉంది. కానీ, కపిల్ ఆడే సమయంలో బ్యాటింగ్‌లో ఈనాటిలా దూకుడు ప్రదర్శించకపోవడం గమనార్హం. టీ20 ఇంటర్నేషనల్స్‌లో కూడా బుమ్రా ఓవర్‌కు 7 కంటే తక్కువ పరుగులే ఇచ్చాడు. అంతర్జాతీయ టీ20లో అతని ఎకానమీ 6.46గా నిలిచింది. 65 కంటే ఎక్కువ వికెట్లు తీసిన ఏ ఫాస్ట్ బౌలర్ ఎకానమీ రేటు బుమ్రా కంటే మెరుగ్గా లేకపోవడం గమనార్హం.