Champions Trophy: కివీస్‌పై గెలిచాం కానీ, ఒక్క సమస్య మాత్రం భయపెడుతోంది! ఆసీస్‌పై ఇలా ఉంటే కష్టం

టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో పోటీ పడుతోంది. గ్రూప్ దశలో విజయాలు సాధించినా, కెఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ లోపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. న్యూజిలాండ్ మ్యాచ్ లో క్యాచ్ డ్రాప్ లు, మిస్ ఫీల్డ్ లు కలవరపెట్టాయి. ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టుతో పోటీలో ఇలాంటి తప్పులు చేస్తే ఇబ్బందులు తప్పవని క్రికెట్ నిపుణులు అంటున్నారు.

Champions Trophy:  కివీస్‌పై గెలిచాం కానీ, ఒక్క సమస్య మాత్రం భయపెడుతోంది! ఆసీస్‌పై ఇలా ఉంటే కష్టం
Team India

Updated on: Mar 03, 2025 | 11:31 AM

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో టీమిండియా గట్టి పోటీని ఎదుర్కొబోతోంది. ఇప్పటి వరకు మూడు గ్రూప్‌ మ్యాచ్‌లు ఆడిన టీమిండియా.. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌లను అలవోకగా ఓడించింది. కానీ, సెమీ ఫైనల్‌లో టీమిండియాకు అసలు సిసలు అగ్ని పరీక్ష ఎదురుకానుంది. సెమీస్‌లో మోస్ట్‌ డేంజరస్‌ ఆస్ట్రేలియాతో తలపడనుంది భారత జట్టు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించి, టీమిండియా ఫైనల్‌కు వెళ్లడంతో పాటు, 2023 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ఓటమి ప్రతీకారం తీర్చుకోవాలని భారత క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచాం, న్యూజిలాండ్‌ను జస్ట్‌ 250 కూడా కొట్టనివ్వకుండా అడ్డుకున్నాం.. ఇక టీమిండియాకు తిరుగులేదు, సెమీస్‌లో ఆసీస్‌ను చిత్తు చేస్తుందని, ఆదివారం భారత్‌, న్యూజిలాండ్‌ చూసిన వారిలో చాలా మంది ధీమాగా ఉన్నారు.

అయితే మ్యాచ్‌ గెలవడం సంతోషమే కానీ, కొన్ని లోపాలు కూడా కొట్టొచ్చినట్లు కనిపించాయి. అందులో టాపార్డర్‌ ఫెయిల్యూర్‌ గురించి పెద్దగా మాట్లాడుకోకపోయినా.. వికెట్‌ కీపర్‌గా కేఎల్‌ రాహుల్‌ తప్పిదాల గురించి కచ్చితంగా టీమ్‌లో రివ్యూ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ వికెట్‌ కీపర్‌గా అంత ఎఫెక్టివ్‌గా కనిపించలేదు. క్యాచ్‌లు వదిలేయడం, మిస్‌ ఫీల్డ్‌ చేయడంతో టీమ్‌ స్టాండెడ్స్‌ను కాస్త తగ్గించినట్లు అనిపించింది. వరల్డ్‌ ఛాంపియన్‌ అవ్వాలంటే ఏ చిన్న వీక్‌నెస్‌ ఉండొద్దు, ఇలాంటి మిస్టేక్స్ను అన్ని మ్యాచ్‌ల్లో మ్యానేజ్‌ చేయలేరు. బ్యాటర్‌ను అవుట్‌ చేసే ఛాన్స్‌ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్‌ చేయవద్దు. క్యాచ్‌లు వదిలేస్తే మ్యాచ్‌ ను వదిలేసినట్లే.

అందుకే వికెట్‌ కీపింగ్‌ విషయంలో కేఎల్‌ రాహుల్‌ మరింత అప్రమత్తంగా ఉండటం అవసరం. ఆస్ట్రేలియా టీమ్‌లో ట్రావిస్‌ హెడ్‌ లాంటి ప్లేయర్‌కు లైఫ్‌ ఇస్తే ఎలా చెలరేగిపోతాడు మనకు అనుభవం ఉంది. పైగా టీమిండియా వరల్డ్‌ క్లాస్‌ ప్లేయర్‌ రిషభ్‌ పంత్‌ను కాదని, కేఎల్‌కు కీపింగ్‌ బాధ్యతను అప్పగించారు కనుక అతనిపై అంచనాలు ఉంటాయి. వాటిని అందుకోవడంలో కేఎల్‌ ఏమాత్రం తడబడినా, అది అతనికే కాదు జట్టుపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. పైగా సెమీస్‌, ఫైనల్‌ లాంటి కీలక మ్యాచ్‌ల్లో ఇలాంటి చిన్న చిన్న సమస్యలతో టీమిండియా ఓడిపోతే మాత్రం ఆ బాధను తట్టుకోవడం కష్టం. న్యూజిలాండ్‌పై చేసిన వికెట్‌ కీపింగ్‌ను కేఎల్‌ రాహుల్‌ ఆస్ట్రేలియాపై రిపీట్‌ చేయొద్దని క్రికెట్‌ అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.