Watch Video: ఓ ఇంటివాడైన దీపక్ చాహర్.. పెళ్లి వేడుకలో డ్యాన్స్‌తో అదరగొట్టిన టీమిండియా ఆల్ రౌండర్..

|

Jun 02, 2022 | 5:30 AM

దీపక్ టీమ్ ఇండియా తరపున 7 వన్డేలు, 20 టీ20 మ్యాచ్‌లు కూడా ఆడాడు. వన్డేల్లో 10 వికెట్లు, టీ20ల్లో 26 వికెట్లు తీశాడు. గాయం కారణంగా వచ్చే దక్షిణాఫ్రికా సిరీస్‌లో దీపక్‌కి టీమిండియాలో చోటు దక్కలేదు.

Watch Video: ఓ ఇంటివాడైన దీపక్ చాహర్.. పెళ్లి వేడుకలో డ్యాన్స్‌తో అదరగొట్టిన టీమిండియా ఆల్ రౌండర్..
Deepak Chahar Jaya Bhardwaj
Follow us on

Deepak Chahar Jaya Bhardwaj Marriage: భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ బుధవారం జయ భరద్వాజ్‌ను వివాహం చేసుకున్నాడు. ఆగ్రాలోని ఫైవ్ స్టార్ హోటల్ జేపీ ప్యాలెస్‌లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లికొడుకుగా మారిన దీపక్ చాహర్.. బ్యాండు మేళంతో, గుర్రంపై కూర్చొని ఊరేగింపుగా హోటల్‌కు చేరుకున్నాడు. క్రీమ్ కలర్ షేర్వానీ, రాజస్థానీ సఫా ధరించి, దీపక్ సరికొత్త లుక్‌లో కనిపించాడు. ఈ వివాహానికి పలువురు రాజకీయ, ప్రముఖులు దీపక్, జయలకు శుభాకాంక్షలు తెలిపారు. ఊరేగింపులో బ్యాండ్ వాద్యాల చప్పుళ్లకు దీపక్ డ్యాన్స్ చేశాడు. బాణాసంచా కాలుస్తూ అతిథులు కూడా డ్యాన్స్ చేశారు. పెళ్లి ఊరేగింపునకు వధువు తరపు వారు ఘనంగా స్వాగతం పలికారు. ద్వారచర్ల వేడుక అనంతరం దీపక్ నేరుగా వేదిక వద్దకు చేరుకున్నాడు. కాసేపటి తర్వాత జయ కూడా వేదికపైకి చేరుకుంది. అతిథుల ముందు ఇద్దరూ కలిసి ఉన్నారు. పూలమాల వేయగానే చప్పట్లు మార్మోగాయి. ఆ తర్వాత ఇద్దరూ ఏడు అడుగులు వేశారు. అనంతరం అతిథులు దీపక్‌తో సెల్ఫీలు దిగుతూ కనిపించారు. దీపక్ కూడా అందరికీ స్వాగతం పలికాడు.

దీపక్, జయను ఆశీర్వదించేందుకు రాజకీయ నేతలు, అధికారులు తరలివచ్చారు. వీరిలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎస్పీ సింగ్ బఘెల్, ఎంపీ ఫతేపూర్ సిక్రి రాజ్‌కుమార్ చాహర్, మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ ప్రొ. రాంశంకర్ కతేరియా, ఏడీజీ రాజీవ్ కృష్ణ, ఆగ్రా మాజీ ఎస్‌ఎస్పీ అమిత్ పాఠక్, మాజీ ఎస్పీ రోహన్ బోత్రే ప్రమోద్, లఘు ఉద్యోగ్ నిగమ్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ గార్గ్, అంతర్జాతీయ క్రికెటర్ కేకే శర్మ, భారత జూనియర్ క్రికెట్ జట్టు సెలక్టర్ హర్విందర్ సింగ్ సోధి, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్ స్టార్‌గా మారిన దీపక్ చాహర్..

అదే సమయంలో, దీపక్ చాహర్ 2016 నుంచి IPL ఆడుతున్నాడు. ఐపీఎల్‌ నుంచే అతనికి మంచి పేరు వచ్చింది. దీపక్ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్, పూణె సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున క్రికెట్ ఆడాడు. ఐపీఎల్ 2022 మెగా వేలం సందర్భంగా చెన్నై దీపక్‌ను రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే వెన్ను గాయం కారణంగా దీపక్ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరంగా ఉన్నాడు. చెన్నై జట్టు కూడా 14 మ్యాచ్‌ల్లో 4 మాత్రమే గెలిచి ప్లే ఆఫ్‌కు దూరమైంది.

దీపక్ టీమ్ ఇండియా తరపున 7 వన్డేలు, 20 టీ20 మ్యాచ్‌లు కూడా ఆడాడు. వన్డేల్లో 10 వికెట్లు, టీ20ల్లో 26 వికెట్లు తీశాడు. గాయం కారణంగా వచ్చే దక్షిణాఫ్రికా సిరీస్‌లో దీపక్‌కి టీమిండియాలో చోటు దక్కలేదు. భారత్ జట్టు జూన్ 9 నుంచి ఆఫ్రికాతో స్వదేశంలో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..