
Prasidh Krishna and Shardul Thakur Trolled: ఇంగ్లాండ్‌తో హెడింగ్లీ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత పేస్ బౌలర్లు ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ తమ పేలవ ప్రదర్శనతో తీవ్ర నిరాశపరిచారు. కీలక సమయంలో పరుగులు నియంత్రించడంలో, వికెట్లు తీయడంలో ఘోరంగా విఫలమవ్వడంతో, భారత క్రికెట్ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. వీరిద్దరి ప్రదర్శనపై సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ వెల్లువెత్తాయి.
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 471 పరుగుల భారీ స్కోరు చేయగా, ఇంగ్లాండ్ 465 పరుగులకు ఆలౌటైంది. అయితే, ఈ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.
గణాంకాలతో విఫలం..
కర్ణాటక పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లు బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టినప్పటికీ, ఏకంగా 128 పరుగులు ఇచ్చాడు. అతని ఎకానమీ రేటు 6.40గా నమోదైంది. ఇది టెస్ట్ క్రికెట్‌లో అత్యంత చెత్త గణాంకాలలో ఒకటిగా నిలిచింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ ప్రసిద్ధ్ తన వైఫల్యాన్ని కొనసాగించాడు. 6 ఓవర్లు వేసి వికెట్ తీయకుండా 38 పరుగులు ఇచ్చాడు. అతని ఎకానమీ 6.33గా ఉంది.
ఇది కూడా చదవండి: Virushka: ఆ విషయంలో నేనే ఫస్ట్.. విరాట్ కోహ్లీకి ఇచ్చిపడేసిన అనుష్క
మరోవైపు, పేస్ ఆల్-రౌండర్‌గా జట్టులోకి వచ్చిన ‘లార్డ్’ శార్దూల్ ఠాకూర్ బంతితో పాటు బ్యాట్‌తోనూ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ అతనికి కేవలం 6 ఓవర్లు మాత్రమే ఇచ్చాడు. అందులో శార్దూల్ వికెట్ తీయకుండా 38 పరుగులు సమర్పించుకున్నాడు (ఎకానమీ 6.33)గా ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో అయితే పరిస్థితి మరింత దారుణంగా మారింది. కేవలం 3 ఓవర్లు వేసి 17 పరుగులు ఇచ్చాడు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు.
ట్రోలింగ్‌కు కారణాలు..
ఈ కారణాలతో భారత క్రికెట్ అభిమానులు ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్‌లను లక్ష్యంగా చేసుకుని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. వారి పేలవ ప్రదర్శనపై ఫన్నీ మీమ్స్ సృష్టిస్తూ తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరు బౌలర్ల వైఫల్యం సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌లలో భారత జట్టు కూర్పుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి