జింబాబ్వేతో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీకి సిద్ధమైన డేంజరస్ ప్లేయర్?

T20 World Cup 2026 India vs Zimbabwe: అభిషేక్ బ్యాటింగ్ పేలవంగా తయారైంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో అతను కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో సగటు 3.75, స్ట్రైక్ రేట్ 75గా నమోదయ్యాయి. అయితే అతని ప్రతిభకు ఇవి సరైన గణాంకాలు కాదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జింబాబ్వేతో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీకి సిద్ధమైన డేంజరస్ ప్లేయర్?
Team India T20i World Cup 2026

Updated on: Feb 25, 2026 | 8:30 PM

Team India update on Rinku Singh: భారత స్టార్ బ్యాట్స్‌మన్ రింకు సింగ్ తన తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి టీమిండియా క్యాంప్‌ను విడిచి ఇంటికి వెళ్లిపోయాడు. అయితే టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో జింబాబ్వేతో జరిగే కీలక మ్యాచ్‌కు ముందు రింకు తిరిగి జట్టుతో చేరనున్నట్లు భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ బుధవారం స్పష్టం చేశారు.

చెన్నైలో ఉన్న భారత జట్టు క్యాంప్‌ను వదిలి రింకు సింగ్ మంగళవారం సాయంత్రం ఇంటికి వెళ్లాడు. తన తండ్రి అనారోగ్యం తీవ్రంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సితాంశు కోటక్, రింకు బుధవారం సాయంత్రానికే తిరిగి జట్టులో చేరనున్నాడని వెల్లడించారు. గురువారం జరిగే జింబాబ్వే మ్యాచ్‌కు ముందు అతను అందుబాటులో ఉంటాడని తెలిపారు.

రింకు సింగ్ తండ్రి స్టేజ్-4 లివర్ క్యాన్సర్‌తో బాధపడుతూ ప్రస్తుతం వెంటిలేటర్ సపోర్ట్‌పై ఉన్నారు. ఈ కారణంగానే రింకు అత్యవసరంగా ఇంటికి వెళ్లాల్సి వచ్చింది.

ప్రీ-మ్యాచ్ మీడియా సమావేశంలో కోచ్ కోటక్ మాట్లాడుతూ, “రింకు తండ్రికి ఆరోగ్యం బాగోలేదు. అందుకే అతను ఇంటికి వెళ్లాడు. కానీ ఈరోజు సాయంత్రం తిరిగి జట్టుతో చేరతాడని అనుకుంటున్నాను,” అని చెప్పారు.

ఇక మరోవైపు, సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయం తర్వాత టీమిండియా తీవ్ర ఒత్తిడిలో ఉంది. టాప్ ఆర్డర్ వైఫల్యం, నెట్ రన్ రేట్ (-3.80) భారీగా పడిపోవడం వల్ల జింబాబ్వేతో జరిగే సూపర్-8 రెండో మ్యాచ్‌లో భారీ తేడాతో గెలవడం భారత్‌కు చాలా కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించకపోతే సెమీఫైనల్ అవకాశాలు ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది.

ఈ వరల్డ్ కప్‌కు ముందు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మల అద్భుతమైన ప్రారంభాలతో భారత్ హోం సిరీస్‌లలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లపై ఆధిపత్యం చెలాయించింది. కానీ ప్రస్తుతం అభిషేక్ శర్మ కడుపు ఇన్ఫెక్షన్‌తో బాధపడడంతో అతని ఫామ్ తగ్గినట్లు కనిపిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us