Nitish Kumar Reddy Wild Celebrations: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పునరాగనం చేసింది. తెలుగబ్బాయ్ నితీష్ కుమార్ రెడ్డి సెంచరీతో మెల్‌బోర్న్ టెస్ట్‌లో భారత జట్టు ఫాలో ఆన్‌ను తప్పించుకోవడమే కాకుండా.. మూడో రోజు దాదాపుగా బ్యాటింగ్ చేసింది. దీంతో ఈ టెస్ట్ ఫలితం డ్రాగా ముగిసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 358 పరుగులు చేసింది. భారత జట్టు ఇంకా 116 పరుగుల వెనుకంజలో నిలిచింది. నితీష్ రెడ్డి, మహ్మద్ సిరాజ్ అజేయంగా నిలిచారు.
టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్న నితీష్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇది కేవలం సెంచరీ కాదని, భారత జట్టు మ్యాచ్‌లో రీఎంట్రీ చేసేలా చేస్తోందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నితీష్ రెడ్డి కూడా తన తొలి టెస్ట్ సెంచరీని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ముందుగా హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వెంటనే పుష్ప స్టైల్‌లో బ్యాట్ తిప్పిన నితీష్ రెడ్డి.. అనంతరం సెంచరీతో మరో అడుగు ముందుకేసి ట్రావిస్ హెడ్‌కు గట్టి కౌంటర్‌గా వైల్డ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.
Century for Nitish Kumar Reddy! 💯
– After constant nervous 40s Nitish has got the most important century of the series for India.
– Peak Cinema 🔥.
– Bro really deserved it.#INDvsAUS pic.twitter.com/ry52MGpoak— Kshitij (@Kshitij45__) December 28, 2024
సెంచరీ పూర్తి చేసిన వెంటనే నితీష్ రెడ్డి.. నేలపై మోకాళ్లపై కూర్చుని, తన బ్యాట్‌ను నేలపై ఉంచి, దానిపై హెల్మెట్‌ను పెట్టి సంబరాలు చేసుకున్నాడు. అలాగే, ఆకాశం వైపు చూస్తూ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ కనిపించాడు.
ఈ క్రమంలో తన కుమారుడి ఆటను ప్రత్యక్షంగా చూస్తోన్న తండ్రి పడిన తపన ఎంతో హైలెట్‌గా నిలిచింది. సెంచరీకి చేరువలో ఉన్నప్పుడు ఆయన పడిన టెన్షన్ అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో నితీష్ రెడ్డి సెంచరీ పూర్తి చేసిన వెంటనే ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ గిల్ క్రిస్ట్ ఓ స్పెషల్ ఇంటర్య్వూ చేశాడు. ఈ క్రమంలో నితీష్ రెడ్డి తండ్రి మాట్లాడుతూ “మా కుటుంబానికి ఇది ఒక ప్రత్యేకమైన రోజు. ఈ రోజును మా జీవితంలో మర్చిపోలేం. నితీష్ 14-15 సంవత్సరాల వయస్సు నుంచి మంచి ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో, ఇది చాలా ప్రత్యేకమైన అనుభూతి. నితీష్ 99 పరుగులతో ఉన్నాడు. 9 వికెట్లు పడిపోయాయి. నేను చాలా టెన్షన్‌లో ఉన్నాను. సిరాజ్‌కి కృతజ్ఞతలు’ అంటూ భావోద్వేగం చెందాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..