ఐపీఎల్ నయా సీజన్ షురూ అవుతోంది. ఈరోజు నుంచి క్రికెట్ మెగా టోర్నీప్రారంభం కానుంది. క్రికెట్ అభిమానులకు ఇక సందడే సందడి. రెండు నెలల పాటు కాలక్షేపానికి ఢోకా లేదు. తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. మెగా టోర్నీతో ఇక క్రికెట్ ఫ్యాన్స్ కు రెండు నెలలు పండగే పండగ. ప్రతి రోజూ రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కొన్ని మ్యాచ్‌లు మధ్యాహ్నం మూడున్నరకు నిర్వహించనున్నారు. గత ఏడాది మాదిరిగానే మొత్తం పది జట్లు బరిలోకి దిగుతున్నాయి.
ఈరోజు నుంచి ప్రారంభమయ్యే టోర్నీ మే 21వరకు జరగనుంది. 50 రోజులకు పైగా జరిగే టోర్నీలో ప్రతీ జట్టు 14 మ్యాచ్‌లు ఆడనుంది. ఇక టోర్నీకి చాలామంది స్టార్ ప్లేయర్లు దూరమైతే.. ఇంకొందరు దూరంగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పంత్, అయ్యర్, బుమ్రా వంటి స్టార్లు గాయాలతో ఐపీఎల్ ఆడే పరిస్థితి లేదు. ఇక స్టార్ ప్లేయర్లైన రోహిత్ శర్మ, కోహ్లీ, షమీ ఈసారి కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడాలని డిసైడ్ అయ్యారు. దీంతో కీలక మ్యాచ్‌లలోనే వీరు అందుబాటులోకి రానున్నారు.
సన్‌రైజర్స్ కెప్టెన్ మార్‌క్రమ్ ఏప్రిల్ 3 తర్వాతే భారత్ చేరుకుంటాడు. దీంతో ఏప్రిల్ 1న లక్నోతో జరగనున్న తొలి మ్యాచ్‌కు దూరం కానున్నాడు మార్‌క్రమ్. ఇటీవల సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో విజేతగా నిలిచిన జట్టుకు కెప్టెన్ మార్‌క్రమే. దీంతో సన్‌రైజర్స్ అతడి నాయత్వంపై బోలెడు ఆశలు పెట్టుకుంది. తొలి మ్యాచ్‌కు భువి కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. సీఎస్కే, ఆర్సీబీ, ముంబై వంటి టాప్ జట్లు కప్‌పై కన్నేశాయి. కాని సన్‌రైజర్స్ యంగ్ టీమ్‌తో బరిలోకి దిగుతోంది. అద్భుతాలు చేయడానికి రెడీ అంటోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..