Team India: భారత క్రికెట్ ప్రతిభకు గని. టీమ్ ఇండియాలో ఎంపికకు ముందు ఆటగాళ్లు చాలా కష్టపడతారు. ముందుగా దేశవాళీలో, తర్వాత ఐపీఎల్‌లో తమ సత్తా చాటాల్సి ఉంటుంది. అప్పుడు ఎక్కడో టీమ్ ఇండియా తలుపులు తెరుచుకుంటాయి. ఈ నీలి రంగు జెర్సీని ఎంతో కష్టపడి సంపాదించాల్సి ఉంటుంది. భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకోవడం ఎంత కష్టమో, ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం. ప్రతి స్థానానికి ఐదుగురు పోటీదారులు ఉంటున్నారు. అయితే, కొంతమంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు మాత్రం.. భారత జట్టులో అవకాశం వచ్చినా.. వారి స్థానాలను కాపాడుకోకుండా.. పేలవ ఫాంతో బయటకు వచ్చారు. వీరు ఎంత త్వరగా జట్టులోకి వచ్చారో.. అంతే త్వరగా బయటకు వచ్చారు. అలాంటి ముగ్గురు బ్యాటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పృథ్వీ షా టీమ్ ఇండియాకు వచ్చినప్పుడు లాంగ్ రేసు గుర్రం అని చెప్పుకున్నారు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రియాన్ లారా కలయిక అంటూ నిపుణులు తేల్చారు. కెరీర్ తొలినాళ్లలో పృథ్వీ ఇలాంటి ఇన్నింగ్స్‌లు ఆడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే, ఎంతో టాలెంటెడ్ అయినప్పటికీ ఈ డాషింగ్ క్రికెటర్ టీమ్ ఇండియాకు దూరమయ్యాడు. సెలక్టర్లు కూడా అతనికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో టీమిండియాలో రీఎంట్రీ ఇవ్వలేకపోతున్నాడు.
ఈ జాబితాలో మొదటి పేరు రాహుల్ త్రిపాఠి. ఐపీఎల్‌లో రాహుల్ త్రిపాఠి తన తుఫాన్ బ్యాటింగ్, చురుకైన ఫీల్డింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున రాహుల్ చాలా మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. తన నిర్భయ బ్యాటింగ్‌తో, అతను టీమ్ ఇండియాలో ప్రవేశం కోసం నిరంతరం తన వాదనను కొనసాగిస్తున్నాడు. 2023లో శ్రీలంకపై తొలి అవకాశం లభించినా జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు. భారత్ తరపున ఐదు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన తర్వాత అతని కెరీర్ ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ తన స్థానాన్ని దక్కించుకోవాలంటే ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉంటుంది.
2020 సంవత్సరంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తన IPL కెరీర్‌ను ప్రారంభించిన ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్.. ఎంతో అద్భుతమైన ఆటతో అందరిని పిచ్చెక్కించారు. వేగంగా పరుగులు సాధించగల సత్తా ఉన్న పడిక్కల్ ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. దేవదత్ పడిక్కల్ 2021లోనే T20 ఇంటర్నేషనల్ ఆడే అవకాశం పొందాడు. కానీ, అతను రెండు మ్యాచ్‌లలో 38 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ ఏడాది ఇంగ్లండ్‌తో ధర్మశాలలో టెస్టుల్లో అరంగేట్రం చేసిన అతను ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..