T20 World Cup 2021: ప్రాక్టిస్ సెషన్‎కు హాజరైన టీం ఇండియా.. ఆటగాళ్లకు దిశానిర్దేశం చేసిన కోచ్ రవి శాస్త్రి..

|

Oct 27, 2021 | 9:54 PM

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో ఓడిపోవడంతో విరామం తీసుకున్న భారత జట్టు బుధవారం ప్రాక్టిస్ కోసం మైదానానికి వచ్చింది. ప్రాక్టిస్ సెషన్‎లో ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేశాడు...

T20 World Cup 2021: ప్రాక్టిస్ సెషన్‎కు హాజరైన టీం ఇండియా.. ఆటగాళ్లకు దిశానిర్దేశం చేసిన కోచ్ రవి శాస్త్రి..
Bcci
Follow us on

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో ఓడిపోవడంతో విరామం తీసుకున్న భారత జట్టు బుధవారం ప్రాక్టిస్ కోసం మైదానానికి వచ్చింది. ప్రాక్టిస్ సెషన్‎లో ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేశాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు ప్రాక్టిస్ సెషన్‌కు దూరమైన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మైదానంలోకి వచ్చాడు. అతని భుజం యొక్క స్కాన్ నివేదికలో బాగానే ఉందని రావటంతో అతడు ప్రాక్టిస్‎కు హాజరయ్యాడు. అదే సమయంలో కొంతమంది పాకిస్తాన్ ఆటగాళ్లు పక్కనే ఉన్న మైదానంలో ప్రాక్టిస్ చేశారు. మంగళవారం న్యూజిలాండ్‌ను ఓడించి బాబర్ అజామ్ టీం రెండు విజయాలతో ఊపు మీద ఉంది.

పాకిస్తాన్‌ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిన టీమిండియాకు ఇకపై ఆడే ప్రతీ మ్యాచ్‌ కీలకంగా మారనుంది. భారత్ ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‎లో తప్పనిసరిగా గెలవాల్సిందే.. లేకుంటే సెమీస్ ఆశలు గల్లంతు అవుతాయి. గ్రూపు-2లో మిగిలిన మూడు చిన్న జట్లతో పాటు బలమైన న్యూజిలాండ్‌ను కోహ్లి సేన తప్పక ఓడించాల్సి ఉంది. అలా అయితేనే ఇండియాకు 8 పాయింట్లు వస్తాయి. న్యూజిలాండ్‌ కూడా భారత్‎తో గెవాల్సిందే లేకుంటా వారి సెమీస్ ఆశలు అవిరవుతాయి. దీంతో ఆదివారం జరిగే మ్యాచ్ రెండు జట్లకు కీలకంగా మారింది.

Read Also.. Ind Vs Pak: హర్భజన్ సింగ్, మహ్మద్ అమీర్ మధ్య ట్విట్టర్ వార్.. పాత వీడియోలు పోస్టు చేస్తున్న మాజీ ఆటగాళ్లు..