T20 World Cup 2021: సెమీస్‎కు ముందు ఇంగ్లాండ్‎కు షాక్.. గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్న ఓపెనర్..

|

Nov 08, 2021 | 9:32 PM

ఇంగ్లాండ్‎ క్రికెట్ జట్టుకు సెమీస్‎ ముందు పెద్ద షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ జాసన్ రాయ్ గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. గాయంతో రాయ్ తప్పుకుంటున్నట్లు ఇంగ్లాండ్ సోమవారం ప్రకటించింది...

T20 World Cup 2021: సెమీస్‎కు ముందు ఇంగ్లాండ్‎కు షాక్.. గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్న ఓపెనర్..
Roy
Follow us on

ఇంగ్లాండ్‎ క్రికెట్ జట్టుకు సెమీస్‎ ముందు పెద్ద షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ జాసన్ రాయ్ గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. గాయంతో రాయ్ తప్పుకుంటున్నట్లు ఇంగ్లాండ్ సోమవారం ప్రకటించింది. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఇంగ్లండ్ చివరి సూపర్ 12 మ్యాచ్‌లో రాయ్ గాయపడ్డాడు. అతడి స్థానంలో జేమ్స్‌ విన్స్‌ జట్టులోకి వచ్చి చేరాడు. టీ20 వరల్డ్ కప్‎లో రాయ్ 5 మ్యాచ్‎లు ఆడి 123 పరుగులు చేశాడు. శ్రీలంకతో మ్యాచ్‎లో 190 పరుగుల ఛేజింగ్‌లో 15 బంతుల్లో 20 పరుగులు చేసి రాయ్ రిటైర్డ్‎హర్ట్ అయ్యాడు. ఆ తర్వాత జాసన్ రాయ్ ఇబ్బంది పడుతూ నడిచాడు. ఇంగ్లాండ్ తమ చివరి సూపర్ 12 మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే 5 మ్యాచ్‌లలో 4 విజయాలతో గ్రూప్-1లో అగ్రస్థానంలో నిలిచింది.

బుధవారం న్యూజిలాండ్‌తో అబుదాబిలో జరిగే సెమీ-ఫైనల్‌లో ఇంగ్లాండ్‌కు మద్దతు ఇవ్వడానికి UAEలోనే ఉంటానని చెప్పాడు. “నేను ప్రపంచ కప్‌కు దూరమైనందుకు చాలా బాధపడ్డాను. నేను ఆటగాళ్లకు మద్దతుగా ఉంటాను, బాగా ఆడి ట్రోఫీని గెలుచుకుంటాం” అని రాయ్ చెప్పాడు.
“వచ్చే ఏడాది ప్రారంభంలో కరేబియన్‌లో జరిగే T20 పర్యటనకు సిద్ధంగా ఉంటాను” అని తెలిపాడు. ఇంగ్లాండ్ సెమీస్‎లో న్యూజిలాండ్‎తో తలపడనుంది. ఈ మ్యాచ్ బుధవారం జరగనుంది. మరో సెమీస్‎లో గురువారం ఆస్ట్రేలియాతో పాకిస్తాన్ తలపడనుంది.

Read Also.. Cricket: 24 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‎లో పర్యటించనున్న ఆస్ట్రేలియా.. 1998లో చివరి పర్యటన..

T20 World Cup 2021: పాకిస్తాన్‎కు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చిన వసీం జాఫర్.. 12-1లో అర్థం ఏమిటంటే..