మ్యాచ్ అన్నాక గెలుపోటములు సహజం. కానీ పాక్‌తో క్రికెట్ మ్యాచ్ అంటే మాత్రం ఈ నీతి సూత్రాలన్నీ పటాపంచలైపోతాయి. దాయాదిపై ఎలాగైనా గెలవాల్సిందే. లేదంటే సగటు వీరాభిమాని సహనం కోల్పోతాడు. ఇష్టం వచ్చినట్టు పేలుతాడు. భారత్-పాక్ టీ20 మ్యాచ్ తర్వాత అదే జరుగుతోంది. ఖేల్ ఖతం అయిపోయినా కాంట్రవర్శీకి మాత్రం ఎండ్ కార్డ్ పడలేదు. మ్యాచ్ ఓటమితో ప్లేయర్లపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలైంది. షమీ భారీగా పరుగులివ్వడం శాపంగా మారింది. అంతా అతనే చేశాడంటూ నెటిజన్లు ట్రోలింగ్ మొదలెట్టారు. అక్కడితో ఆగకుండా దేశం, మతం అంటూ సిట్యువేషన్‌ని ఎక్కడికో తీసుకెళ్లారు. పాక్ వెళ్లాలంటూ అక్కసు వెళ్లగక్కారు. ఈ రోత రాతల్ని ఖండిస్తూ.. షమీకి సీనియర్ క్రికెటర్లంతా మద్దతు పలికారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్, హర్షాబోగ్లే లాంటి కామెంటేటర్లు బాసటగా నిలిచారు. షమీని ట్రోల్ చేస్తున్న వారికి ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
? ? We exactly know how to approach the matches ahead.#TeamIndia captain @imVkohli on how the side will go about their upcoming #T20WorldCup games. #INDvNZ pic.twitter.com/lChCoNorCQ
— BCCI (@BCCI) October 30, 2021
ఒక్క షమీనే కాదు పాండ్యా, కేఏల్ రాహుల్, రోహిత్ శర్మలు కూడా ట్రోలింగ్‌కు గురయ్యారు. దీంతో న్యూజిల్యాండ్‌తో మ్యాచ్‌లో ఫైనల్ లెవెన్‌లో ఎవరుంటారన్నఊహాగానాలు మొదలయ్యాయి. అయితే వీటన్నింటికి కెప్టెన్ కోహ్లీ చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు. విమర్శలెన్ని వచ్చినా కోహ్లీ మాత్రం సేమ్ టీమ్‌కే ఓటు అన్న సంకేతాలిచ్చారు. అయితే షమీ, పాండ్యా, రాహుల్, రోహిత్‌లు ఎలా రాణిస్తారన్నది కీలకంగా మారింది. వాళ్ల ఫెర్మామెన్స్‌తో ట్రోలింగ్ చేసిన వాళ్ల నోళ్లు మూయిస్తారా.. సెమీస్ ఆశల్ని సజీవంగా ఉంచుతారా అన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది.
ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్‌కు టీమిండియాపై ఘనమైన రికార్డు ఉంది. గత 18 ఏళ్లల్లో న్యూజిలాండ్‌పై ఐసీసీ టోర్నీల్లో విజయాన్ని అందుకోలేకపోయింది. 2019 వన్డే వరల్డ్‌కప్ సెమీస్… 2021 టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్… ఈ రెండు ఐసీసీ టోర్నీలలో న్యూజిలాండ్ టీమ్ భారత్‌ను దెబ్బ కొట్టింది. గత టి20 ప్రపంచకప్‌లో భారత్‌ను సొంతగడ్డపైనే చిత్తు చేసింది. ఓవరాల్‌గా చూస్తే ప్రస్తుతం భారత్‌దే పైచేయిగా కనిపిస్తున్నా… కివీస్ ఎంత ప్రమాదకర ప్రత్యర్థో కోహ్లి సేనకు బాగా తెలుసు. మొదటి మ్యాచ్ ఫలితాన్ని పక్కన పెట్టి తొలి విజయం కోసం రెండు టీమ్‌లు సన్నద్ధం కావడంతో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.
ఓపెనర్లు రోహిత్, రాహుల్ గత మ్యాచ్ వైఫల్యాన్ని పక్కన పెట్టి చెలరేగితే భారత్ భారీ స్కోరు చేయడం ఖాయం. ఫైనల్‌గా ఈ మ్యాచ్‌లో కూడా టాస్ కీలకంగా కానుంది. ఎవరు టాస్ గెలిస్తే వాళ్లు దాదాపు సగం విజయం సాధించినట్టే. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌లో ఎవరు నిలిచి గెలుస్తారన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది.
Also Read: ‘డాడీ.. మమ్మల్ని వదిలి వెళ్లావా’.. కన్నీటి పర్యంతమైన పునీత్ కుమార్తె