IND vs NAM, T20 World Cup LIVE Streaming: చివరి అంకానికి చేరిన టీమిండియా ప్రయాణం.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా లైవ్ చూడాలో తెలుసా..

|

Nov 10, 2021 | 9:48 AM

టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 12 రౌండ్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. సోమవారం సూపర్ 12 చివరి మ్యాచ్  టీమిండియా, నమీబియా మధ్య జరగనుంది. రెండు జట్లు సెమీఫైనల్ రేసులో..

IND vs NAM, T20 World Cup LIVE Streaming: చివరి అంకానికి చేరిన టీమిండియా ప్రయాణం.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా లైవ్ చూడాలో తెలుసా..
Ind Vs Nam
Follow us on

టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 12 రౌండ్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. సోమవారం సూపర్ 12 చివరి మ్యాచ్  టీమిండియా, నమీబియా మధ్య జరగనుంది. రెండు జట్లు సెమీఫైనల్ రేసులో లేనందున ఈ మ్యాచ్ ఇప్పుడు లాంఛనప్రాయమే. గ్రూప్ 1 నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, గ్రూప్ 2 నుంచి పాకిస్తాన్, న్యూజిలాండ్ సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. ఈ విజయంతో తమ ప్రయాణాన్ని ముగించాలని టీమిండియా ప్రయత్నిస్తోంది. టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ ప్రయాణం నిరాశాజనకంగా మిగిలిపోయింది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో ఓడగా.. రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడింది. దీని తర్వాత టీమిండియా, స్కాట్లాండ్, ఆఫ్ఘనిస్తాన్‌లను ఓడించింది. అయితే న్యూజిలాండ్ వారి మిగిలిన అన్ని మ్యాచ్‌లలో గెలిచి సెమీ-ఫైనల్‌లో స్థానం సంపాదించింది.

టీమిండియా ఈ రేసు నుండి నిష్క్రమించింది. ఈ టోర్నీలో టీమిండియా బౌలర్ల ప్రదర్శన చాలా నిరాశపరిచింది. మ్యాచ్‌కి ఒకరోజు ముందు విలేకరుల సమావేశంలో బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌ను ఈ ప్రపంచకప్‌లో బౌలర్ల ప్రదర్శన గురించి అడిగినప్పుడు.. నేను ఎటువంటి సాకులు చెప్పడానికి ఇష్టపడను.. అయితే ఈ ప్రపంచకప్‌లో టాస్ గెలిచిన జట్టు దుబాయ్ స్టేడియంలో ప్రయోజనం ఉంటుంది. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడం కష్టమైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండ్‌ చేసుకునే అవకాశం వచ్చింది.. కానీ చేయలేదని  స్పష్టత ఇచ్చారు.

T20 ప్రపంచ కప్ 2021లో టీమిండియా వర్సెస్ నమీబియా జట్లు ఎప్పుడు తలపడతాయి ?

నవంబర్ 8న (సోమవారం) భారత్, నమీబియా జట్లు తలపడనున్నాయి.

T20 ప్రపంచ కప్ 2021లో టీమిండియా వర్సెస్ నమీబియా మధ్య మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?

టీ20 ప్రపంచకప్ 2021లో భారత్, నమీబియా మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.

T20 ప్రపంచ కప్ 2021 టీమిండియా వర్సెస్ నమీబియా మధ్య మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

టీ20 ప్రపంచకప్ 2021లో భారత్, నమీబియా మధ్య భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. రాత్రి 7 గంటలకు టాస్‌ జరుగుతుంది.

ఇండియా vs నమీబియా మ్యాచ్‌ని మీరు ఎక్కడ ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు?

ఇండియా వర్సెస్ నమీబియా మధ్య జరిగే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో వివిధ భాషల్లో చూడవచ్చు.

ఇండియా vs నమీబియా లైవ్ స్ట్రీమింగ్ ఆన్‌లైన్‌లో నేను ఎక్కడ చూడగలను?

డిస్నీ+హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ సబ్‌స్క్రిప్షన్‌తో మ్యాచ్‌ను ఆన్‌లైన్‌లో వీక్షించవచ్చు. ఇది కాకుండా, మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారంను కూడా tv9telugu.comలో చూడండి.

ఇవి కూడా చదవండి: Telangana: మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్ మార్గదర్శకాలు

NZ vs AFG Match Result: సెమీస్ చేరిన న్యూజిలాండ్.. కోహ్లీసేనకు నిరాశే మిగిల్చిన ఆఫ్ఘనిస్తాన్..!