T20 World Cup: భారత్, పాకిస్తాన్ మ్యాచ్ రద్దు చేయలేం.. తేల్చిచెప్పిన బీసీసీఐ..

|

Oct 18, 2021 | 7:45 PM

ఐసీసీ టీ 20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‎ను రద్దు చేయాలన్న డిమాండ్లపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. లోయలో కాశ్మీరీయేతర పౌరులపై దాడులను తాను ఖండిస్తున్నానని..

T20 World Cup: భారత్, పాకిస్తాన్ మ్యాచ్ రద్దు చేయలేం.. తేల్చిచెప్పిన బీసీసీఐ..
India
Follow us on

ఐసీసీ టీ 20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‎ను రద్దు చేయాలన్న డిమాండ్లపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. లోయలో కాశ్మీరీయేతర పౌరులపై దాడులను తాను ఖండిస్తున్నానని.. అయితే బోర్డు ‘అంతర్జాతీయ నిబద్ధత’ నుంచి వైదొలగలేదని అన్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్వహించిన టోర్నమెంట్ నుంచి దేశాలు వెనక్కి తగ్గలేవని శుక్లా చెప్పారు. “మేము హత్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. తీవ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని అన్నారు. మ్యాచ్ విషయానికి వస్తే, ఐసీసీ అంతర్జాతీయ కట్టుబాట్ల ప్రకారం ఎవరితోనైనా ఆడటానికి నిరాకరించలేమని రాజీవ్ శుక్లా అన్నారు. అక్టోబర్ 24 న దుబాయ్‌లో జరిగే సూపర్ 12 స్టేజ్‌లో భారత్ తన మొదటి ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడుతుంది.

జమ్మూ కశ్మీర్‌లో స్థానికేతరులపై ఉగ్రదాడులు జరిగాయి. బీహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లకు చెందిన వీధి వ్యాపారి, కార్పెంటర్‌ను హత్యచేసిన ఉగ్రవాదులు.. ఆదివారం బీహార్‌కు చెందిన మరో ఇద్దరు వలస కూలీలను పొట్టనబెట్టుకున్నారు. కుల్గాంలోని వాన్‌పోహ్‌ ప్రాంతంలో వలస కూలీలు అద్దెకు ఉంటున్న గదిలోకి చొరబడిన తీవ్రవాదులు.. విక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ఒకరు గాయపడ్డారు. దీంతో సోషల్ మీడియాలో ban pak cricket అంటూ డిమాండ్లు మొదలయ్యాయి. మరి కొందరు పాకిస్తాన్‎తో మ్యాచ్‎ను రద్దు చేయాలని డిమాండా చేశారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వంటి వారు రెండు దేశాల మధ్య ఉద్రిక్త సంబంధాల కారణంగా మ్యాచ్ విషయంలో ‘పునరాలోచన’ చేయాలని కోరారు.

Read Also.. T20 World Cup: హార్దిక్ పాండ్యాకు సర్‎ప్రైజ్ ఇచ్చిన కొడుకు అగస్త్య.. నెట్టింట వీడియో వైరల్..