యూఏఈలో జరిగే టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు 15 మంది ఆటగాళ్లు, ఎనిమిది మంది అధికారులను తీసుకొచ్చేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అనుమతించింది. ఈమేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) అధికారి శుక్రవారం ఈ విషయాన్ని ధృవీకరించారు. టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనే దేశాలు తమ స్వార్డ్‌లోని 15 మంది ఆటగాళ్లతోపాటు కోచ్, సహాయక సిబ్బంది సహా ఎనిమిది మంది అధికారుల జాబితాను పంపాలంటే ఐసీసీ సెప్టెంబర్ 10 వరకు గడువు విధించిందని ఆ అధికారి తెలిపారు. ఈ అధికారి పీటీఐతో మాట్లాడుతూ, ‘టీ 20 ప్రపంచకప్‌లో పాల్గొనే దేశాలకు కోవిడ్ -19, బయో-బబుల్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జట్టుతో అదనపు ఆటగాళ్లను తీసుకురావడానికి ఐసీసీ అనుమతించింది. అయితే దీనికి అయ్యే ఖర్చును ఆయా బోర్డులే భరించాలని పేర్కొంది. 15 మంది ఆటగాళ్లు, ఎనిమిది మంది అధికారుల ఖర్చులను మాత్రమే ఐసీసీ భరిస్తుందని పేర్కొన్నారు.
2016 సంవత్సరం తర్వాత మొదటిసారిగా టీ 20 ప్రపంచకప్ ఒమన్, యూఏఈ (దుబాయ్, అబుదాబి, షార్జా) లో అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరుగుతుంది. ఎనిమిది దేశాల క్వాలిఫయింగ్ టోర్నమెంట్ సెప్టెంబర్ 23 నుంచి జరుగుతుంది. ఇందులో శ్రీలంక, బంగ్లాదేశ్, ఐర్లాండ్ జట్లు కూడా ఉన్నాయి. ఇందులో నాలుగు జట్లు సూపర్ -12 దశకు అర్హత సాధిస్తాయి. “కోవిడ్ -19 పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎంత మంది అదనపు ఆటగాళ్లను తన ప్రధాన బృందంలో ఉంచాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలని” ఐసీసీ పేర్కొన్నట్లు అధికారి తెలిపారు. ప్రధాన జట్టులోని ఆటగాడు కోవిడ్ -19 పరీక్షలో పాజిటివ్‌గా వచ్చినా లేదా గాయపడినా, అదనపు ఆటగాళ్లలో ఒకరు అతని స్థానాన్ని భర్తీ చేసుకోవచ్చని తెలిపారు.
సెప్టెంబర్ 10 లోపు లిస్టును పంపాలి
టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనే దేశాలు తమ జాబితాను సెప్టెంబర్ 10లోపు పంపాలని ఐసీసీ పేర్కొనట్లు ఆయన తెలిపారు. అయితే వారి అక్కడకు బయలుదేరే ఐదు రోజుల ముందు వరకు ఈ లిస్టులో మార్పులు చేసేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ టోర్నమెంట్ భారతదేశంలో జరగాల్సి ఉంది. కానీ కోవిడ్ -19 పరిస్థితి కారణంగా, ఐసీసీ, బీసీసీఐలు యూఏఈకి తరలించిన సంగతి తెలిసిందే. అయితే హోస్టింగ్ మాత్రం బీసీసీఐ చేతిలోనే ఉంది.
Also Read:
Khel Duniya With Satya: ఒలింపిక్స్‌లో క్రికెట్ ఎందుకు లేదో తెలుసా?.. అయితే ఈ వీడియో చూడండి…
నీ బ్యాటింగ్‌లో దమ్ము లేదు.. విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోవాలంటూ సలహా.. ఆ బ్యాట్స్‌మెన్ ఎవరంటే?