అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ వైద్య పర్యవేక్షణకు వైద్య నిపుణుల కమిటీని ఐసీసీ ఆదివారం నియమించింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తరఫున అభిజిత్ సాల్వేతో సహా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) వైద్య నిపుణుల కమిటీ వేసింది. కోవిడ్-19 పరిస్థితుల దృష్ట్యా ఈ కమిటీ వేసినట్లు యాక్టింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియోఫ్ అల్లార్డైస్ అన్నారు. ఎవరికైనా కరోనా వస్తే మ్యాచ్ నిర్వహించలో లేదో కమిటీ నిర్ణయిస్తుంది. బయో-బబుల్ ఉన్నప్పటికీ కొన్ని కోవిడ్ కేసులు అవకాశం ఉందని ఐసీసీ ఇప్పటికే సభ్య దేశాలతో చర్చించింది. “సభ్యులతో మాట్లాడుతునే ఉన్నామని, మాకు ఒక కమిటీ ఉంది. ఈవెంట్ సమయంలో తలెత్తే ఏవైనా ఆరోగ్య సమస్యలు పరిశీలించడానికి కమిటీ ఏర్పాటు చేశాం “అని అల్లార్డైస్ చెప్పారు.
మ్యాచ్‌ల సంబంధంచి ఏవైనా నిర్ణయాలు ఆ కమిటీ తీసుకుంటుందని చెప్పాడు. పురుషుల టీ 20 ప్రపంచకప్ అక్టోబర్ 17 నుండి నవంబర్ 14 వరకు జరుగనుంది. టీ20 ప్రపంచకప్‌లో నిర్ణయ సమీక్ష విధానంను ప్రవేశపెట్టనున్నట్లు ఐసీసీ తెలిపింది. ప్రతి జట్టుకు ఒక ఇన్నింగ్స్‌లో గరిష్టంగా రెండు రివ్యూలు అందుబాటులో ఉంటాయి. గతంలో వన్డేల్లో ప్రతి జట్టుకు ఒక ఇన్నింగ్స్‌లో ఒక డీఆర్ఎస్, టెస్టుల్లో 2 డీఆర్ఎస్లు అమలులో ఉండేవి. కాగా అక్టోబర్ 24న భారత్ పాకిస్తాన్తో తలపడనుంది.