Ishan Kishan : ఈషాన్ కిషన్ తాతయ్య అమాయకత్వం.. అదితి అడిగిన ఆ ఒక్క ప్రశ్నతో సోషల్ మీడియా షేక్

Ishan Kishan : టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా అదరగొడుతోంది. వరుసగా మూడు విజయాలతో సూపర్-8 రౌండ్‌లో కి దూసుకెళ్లింది. ఈ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న వికెట్ కీపర్ బ్యాటర్ ఈషాన్ కిషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాడు.

Ishan Kishan : ఈషాన్ కిషన్ తాతయ్య అమాయకత్వం.. అదితి అడిగిన ఆ ఒక్క ప్రశ్నతో సోషల్ మీడియా షేక్
Ishan Kishan

Updated on: Feb 18, 2026 | 2:21 PM

Ishan Kishan : టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా అదరగొడుతోంది. వరుసగా మూడు విజయాలతో సూపర్-8 రౌండ్‌లోకి దూసుకెళ్లింది. ఈ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న వికెట్ కీపర్ బ్యాటర్ ఈషాన్ కిషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాడు. అయితే మైదానంలో అతని బ్యాటింగ్ ఎంతలా చర్చనీయాంశమవుతుందో, బయట అతని పర్సనల్ విషయాలు కూడా అంతే వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈషాన్ కిషన్ తాతగారు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఎంతలా అంటే, ఈషాన్ గర్ల్ ఫ్రెండ్ అదితి హుండియా సైతం ఆయనకు ఫ్యాన్ అయిపోయి ఒక తమాషా ప్రశ్న వేసింది.

ఈ వివాదానికి లేదా ఈ చర్చకు కారణం ఈషాన్ కిషన్ తాతయ్య రీసెంట్‌గా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ. అందులో ఆయన ఈషాన్ కిషన్, అదితి హుండియా లవ్ స్టోరీ గురించి మాట్లాడుతూ.. వారిద్దరి పెళ్లికి పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈషాన్ ఎవరిని ఇష్టపడితే వారితోనే పెళ్లి జరుగుతుంది అని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అయితే ఈ వార్తలపై ఈషాన్ తల్లి వెంటనే స్పందిస్తూ.. ప్రస్తుతం ఈషాన్ దృష్టి అంతా కెరీర్, వరల్డ్ కప్‌పైనే ఉందని, పెళ్లి గురించి ఇప్పుడే ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు.

అయితే అసలు మ్యాటర్ ఏంటంటే.. ఈషాన్ కిషన్ తాతగారు మరో వీడియోలో తన మనవడితో ఫోన్‌లో మాట్లాడుతున్న ఆడియోను వినిపించారు. ఆ కాల్‌లో ఈషాన్ కిషన్ నవ్వుతూ.. “తాతయ్య, మీ ఇంటర్వ్యూ అదితి చూసింది. ఆమె చాలా సంతోషపడింది. అంతేకాకుండా మీ చర్మం అంతగా ఎలా మెరుస్తోంది? మీ గ్లో రహస్యం ఏంటి? అని సరదాగా అడిగింది” అని చెప్పడం వినిపించింది. మీడియా ముందు తన మనవడితో స్పీకర్ ఆన్ చేసి మాట్లాడిన ఈ తాతయ్య అమాయకత్వం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ఇప్పుడు ఫేస్‌బుక్, ఎక్స్ వేదికగా తెగ షేర్లు అవుతోంది.

మరోవైపు ఈషాన్ కిషన్ ఫామ్ విషయానికి వస్తే, అతను భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. సుమారు రెండేళ్ల పాటు జట్టుకు దూరంగా ఉన్న ఈషాన్, న్యూజిలాండ్ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చి వరల్డ్ కప్‌లో ఓపెనర్‌గా స్థానం సంపాదించాడు. పాకిస్థాన్‌పై కేవలం 40 బంతుల్లోనే 77 పరుగులు చేసి టీమిండియా విజయంలో సింహభాగం పోషించాడు. ప్రస్తుతం ఈ వరల్డ్ కప్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఈషాన్ కిషన్ కొనసాగుతున్నాడు. బ్యాటింగ్‌తో పాటు అదితితో పెళ్లి వార్తలు కూడా తోడవ్వడంతో ఈషాన్ పేరు మార్మోగిపోతోంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us