
India Semifinal Qualification Scenario: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో టీమిండియాకు టెన్షన్ పెరిగింది. ఇకపై భారత్‌కు కేవలం మ్యాచ్ గెలవడం సరిపోదు.. నెట్ రన్ రేట్ (NRR) కూడా కీలక పాత్ర పోషించనుంది. సౌతాఫ్రికా చేతిలో ఎదురైన 76 పరుగుల భారీ ఓటమితో భారత్ నెట్ రన్ రేట్ -3.800కి పడిపోయింది. గ్రూప్-1లో భారత్‌కు జింబాబ్వే, వెస్టిండీస్‌తో ఇంకా రెండు కీలక మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. సెమీఫైనల్ చేరాలంటే ఈ రెండు మ్యాచ్‌లలో తప్పనిసరిగా గెలవడమే కాకుండా, నెట్ రన్ రేట్‌ను భారీగా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. పాయింట్లు సమానంగా ఉన్నప్పుడు సెమీఫైనల్ అర్హత నెట్ రన్ రేట్ ఆధారంగానే నిర్ణయించబడుతుంది.
తదుపరి మ్యాచ్ జింబాబ్వేతో ఉండటంతో, ఈ మ్యాచ్‌లో భారత్ వ్యూహం మొత్తం నెగటివ్‌లో ఉన్న NRRని పాజిటివ్ జోన్‌లోకి తీసుకురావడంపైనే ఆధారపడి ఉంటుంది.
జింబాబ్వేపై భారీ తేడాతో గెలవడం భారత్‌కు అత్యవసరం. భారత్ ముందుగా బౌలింగ్ చేస్తే, ప్రత్యర్థిని తక్కువ స్కోర్‌కే కట్టడి చేసి, లక్ష్యాన్ని చాలా వేగంగా చేధించాలి. టార్గెట్ చిన్నగా ఉంటే తక్కువ ఓవర్లలో చేధించడం సులభమవుతుంది. అయినప్పటికీ, బ్యాటింగ్‌లో దూకుడుగా ఆడాల్సిందే.
జింబాబ్వే 90 పరుగులు మాత్రమే చేస్తే, భారత్ 9 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించాలి. అలా చేస్తే నెట్ రన్ రేట్‌లో భారీగా పెరుగుదల ఉంటుంది.
లక్ష్యం 150 పరుగులు ఉంటే, భారత్ 11 ఓవర్లలోనే మ్యాచ్ ముగించాలి. టాప్ ఆర్డర్ దూకుడుగా ఆడితే ఇది సాధ్యమే. ఈ సందర్భంలో భారత్ NRR నెగటివ్ నుంచి పాజిటివ్‌గా మారే అవకాశం ఉంటుంది.
జింబాబ్వే 180 నుంచి 200 పరుగులు చేస్తే, భారత్ 12 నుంచి 15 ఓవర్లలో గెలవాలి. దీనితో NRR మెరుగుపడుతుంది. కానీ పూర్తిగా పాజిటివ్‌లోకి రావడానికి ఇంకా కష్టమే. టార్గెట్ పెరిగిన కొద్దీ అవసరమైన రన్‌రేట్ కూడా పెరుగుతుంది.
భారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తే నెట్ రన్ రేట్‌ను నెగటివ్ నుంచి పాజిటివ్‌గా మార్చడం మరింత కష్టమవుతుంది. ఈ పరిస్థితిలో భారత్ కనీసం 220 నుంచి 250కి పైగా పరుగులు చేయాలి. అనంతరం ప్రత్యర్థిని 100-120 లేదా అంతకంటే తక్కువ స్కోర్‌కే కట్టడి చేయాలి. ప్రత్యర్థిని ఆలౌట్ చేస్తే ఓవర్లు ఆదా అవుతాయి కాబట్టి NRRకి మరింత లాభం ఉంటుంది.
మొదటి మ్యాచ్‌లో భారత్ ఆలౌట్ కావడం వల్లే నెట్ రన్ రేట్ తీవ్రంగా పడిపోయింది. అందుకే ఇకపై ప్రతి మ్యాచ్‌లో భారీ గెలుపే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగాల్సి ఉంటుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..