T20 World Cup 2024: టీమిండియా ఎంపికకు ముహూర్తం ఫిక్స్! హార్దిక్ పాండ్యా భవితవ్యం తేలేది ఆరోజే

IPL 2024 మ్యాచ్‌లు హోరాహోరీగా జరుగుతున్నాయి. దీంతో పాటు T20 ప్రపంచ కప్ 2024 కోసం కౌంట్‌డౌన్ కూడా ప్రారంభమైంది. దీనికి సంబంధించి టీమ్ ఇండియాను త్వరలో ప్రకటించనున్నారు. మీడియా నివేదికల ప్రకారం, టీ20 ప్రపంచకప్‌కు టీమ్ ఇండియా ఎంపిక..

T20 World Cup 2024: టీమిండియా ఎంపికకు ముహూర్తం ఫిక్స్! హార్దిక్ పాండ్యా భవితవ్యం తేలేది ఆరోజే
Team India
Follow us

|

Updated on: Apr 20, 2024 | 7:39 PM

IPL 2024 మ్యాచ్‌లు హోరాహోరీగా జరుగుతున్నాయి. దీంతో పాటు T20 ప్రపంచ కప్ 2024 కోసం కౌంట్‌డౌన్ కూడా ప్రారంభమైంది. దీనికి సంబంధించి టీమ్ ఇండియాను త్వరలో ప్రకటించనున్నారు. మీడియా నివేదికల ప్రకారం, టీ20 ప్రపంచకప్‌కు టీమ్ ఇండియా ఎంపిక ఏప్రిల్ 27 లేదా 28న జరగవచ్చు. ఈ రెండు తేదీల్లో ఏదో ఒక తేదీన కెప్టెన్ రోహిత్ శర్మ, భారత సెలక్టర్లు కూర్చుని టీమ్ ఇండియాను ఎంపిక చేస్తారని వార్తలు వస్తున్నాయి. టీ20 ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించడానికి చివరి గడువు మే 1. కాగా ఐపీఎల్ 2024 షెడ్యూల్ ప్రకారం ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఏప్రిల్ 27న ఢిల్లీలో జరగనుంది. ఈ నేపథ్యంలోనే హిట్ మ్యాన్ తో భారత సెలెక్టర్లతో సమావేశం, జట్టు ఎంపిక రెండూ ఖరారైనట్లు భావిస్తున్నారు.

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా ఈ సెలక్షన్ మీటింగ్ కోసం స్పెయిన్ నుంచి సెలవుల అనంతరం భారత్‌కు తిరిగి వచ్చారు. ఏప్రిల్ 30న లక్నో సూపర్ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరగనున్న దృష్ట్యా, ఏప్రిల్ 27 లేదా 28వ తేదీని జట్టు ఎంపికకు అనువైనదిగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఈ తేదీల్లో సెలక్టర్లతో పాటు భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఢిల్లీలోనే ఉంటారు.

ఇవి కూడా చదవండి

హార్దిక్ పై సస్పెన్స్..

ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌కు టీమ్ ఇండియాలో ఏ ఆటగాళ్లను ఎంపిక చేయవచ్చనేది ప్రశ్న. ప్రస్తుతం కనీసం 10 మంది ఆటగాళ్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ లకు ప్రపంచకప్ బెర్తు ఖరారైందని సమాచారం. ఈ 10 మంది పేర్లలో హార్దిక్ పాండ్యా పేరు లేదు, ఎందుకంటే అతని గురించి సరైన సమాచారం అందుబాటులో లేదు. ఐపీఎల్‌లో హార్దిక్ బౌలింగ్ చేస్తేనే అతడిని పరిగణనలోకి తీసుకోవచ్చని చెబుతున్నారు.

టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు (అంచనా)

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్/శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, యుజ్వేంద్ర చాహల్, రింకూ సింగ్, కుల్‌దీప్, బుమ్రా మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?