PM Modi: మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది: టీమిండియా క్రికెటర్లతో ప్రత్యేకంగా మాట్లాడిన ప్రధాని మోడీ.. ఏమన్నారంటే

|

Jun 30, 2024 | 10:43 AM

రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో 17 ఏళ్ల ట్రోఫి కరువుకు రోహిత్ సేన చెక్ పెట్టేసిన సంతగి తెలిసిందే. ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టును చూసి గర్విస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ టీమ్ ఇండియాకు అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ మ్యాచ్‌ చారిత్రాత్మకమైనదని, టీ20 ప్రపంచకప్‌ను భారత జట్టు తమదైన స్టైల్లో ఇంటికి తీసుకొచ్చిందంటూ ప్రశంసలు కురిపించారు.

PM Modi: మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది: టీమిండియా క్రికెటర్లతో ప్రత్యేకంగా మాట్లాడిన ప్రధాని మోడీ.. ఏమన్నారంటే
Pm Narendra Modi Congratula
Follow us on

 PM Narendra Modi Speaks to Team India: రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో 17 ఏళ్ల ట్రోఫి కరువుకు రోహిత్ సేన చెక్ పెట్టేసిన సంతగి తెలిసిందే. ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టును చూసి గర్విస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ టీమ్ ఇండియాకు అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ మ్యాచ్‌ చారిత్రాత్మకమైనదని, టీ20 ప్రపంచకప్‌ను భారత జట్టు తమదైన స్టైల్లో ఇంటికి తీసుకొచ్చిందంటూ ప్రశంసలు కురిపించారు.

‘ఈ ఘన విజయం సాధించినందుకు దేశప్రజలందరి తరపున టీమ్‌ఇండియాకు అభినందనలు. ఈరోజు 140 కోట్ల మంది దేశప్రజలు మీ అద్భుతమైన ఆటతీరుకు గర్వపడుతున్నారు. మీరు ప్లేగ్రౌండ్‌లో ప్రపంచకప్‌ను గెలుచుకున్నారు. ఒక ప్రత్యేక కారణంతో ఈ విజయాన్ని గుర్తుంచుకోవాలి. ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా, వరుస విజయాలు సాధించారు. మీ ఆటతో ఈ మొత్తం టోర్నమెంట్‌ను కూడా ఆసక్తికరంగా మార్చారు’ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.

టీమిండియా ఆటగాళ్లతో ప్రత్యేకంగా ఫోన్ చేసిన మాట్లాడిన ప్రధాని.. అద్భుతమైన కెప్టెన్సీతో టోర్నీ ఆసాంతం ఆకట్టుకున్న రోహిత్ శర్మను అభినందించారు. అలాగే, ఫైనల్ పోరులో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌తో పాటు భారత క్రికెట్‌కు అందించిన సేవలను ప్రధాని కొనియాడారు. ఇక చివరి ఓవర్‌లో హార్దిక్ పటేల్‌ను, సూర్యకుమార్ యాదవ్‌ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌ను కూడా ప్రత్యేకంగా అభినందించారు. అలాగే, జస్ప్రీత్ బుమ్రా సహకారం గురించి కూడా గుర్తు చేశారు. ఇక ఈ టోర్నీతో వీడ్కోలు చెప్పనున్న టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సేవలకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..