
India vs Australia Head-to-Head Records and Stats: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా 51వ మ్యాచ్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా తలపడనున్నాయి. సూపర్ 8లో గ్రూప్ 1లో భాగంగా జరనున్న ఈ మ్యాచ్ సెయింట్ లూసియాలోని డారెన్ సామీ నేషనల్ క్రికెట్ స్టేడియంలో నేడు జరగనుంది. సెమీఫైనల్‌కు వెళ్లే విషయంలో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత చాలా ఎక్కువ. భారత్ తన గ్రూప్‌లో 2 విజయాలతో అగ్రస్థానంలో ఉంది. అయితే, తదుపరి దశలో దాని స్థానం నిర్ధారణ కావాలంటే, ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సి ఉంటుంది. అదే సమయంలో, ఆఫ్ఘనిస్తాన్‌పై ఆస్ట్రేలియా ఓటమి ముందుకు వెళ్లడం కష్టతరం చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఓడిస్తేనే, ఆసీస్‌కు ఛాన్స్ ఉంటుంది. అయితే, కంగారూలకు భారత జట్టును ఓడించడం అంత సులభం కాదు. ఎందుకంటే క్రికెట్‌లోని పొట్టి ఫార్మాట్‌లో, ఆస్ట్రేలియాపై టీమిండియాదే పైచేయిగా నిలిచింది.
టోర్నమెంట్ చరిత్రలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య చాలా క్లోజ్ మ్యాచ్‌లు జరిగాయి. చాలా మ్యాచ్‌లలో విజేత భారీ విజయాన్ని నమోదు చేసింది. 2007 నుంచి T20 ప్రపంచ కప్‌లో ఈ రెండు జట్ల మధ్య 5 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో టీమ్ ఇండియా 3 గెలిచింది. ఆస్ట్రేలియా 2 మ్యాచ్‌లు గెలిచింది. ఈ రెండు జట్ల మధ్య మొదటి మ్యాచ్ 2007 ప్రారంభ ఎడిషన్‌లో జరిగింది. ఇందులో భారత్ 15 పరుగుల తేడాతో గెలిచింది. అదే సమయంలో, 2010, 2012లో ఆస్ట్రేలియా వరుసగా 49, 9 వికెట్ల తేడాతో గెలుపొందగా, భారత జట్టు 2014లో 73 పరుగులతో, 2016లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టీ20 ఇంటర్నేషనల్‌లో రికార్డుల గురించి మాట్లాడితే, ఇక్కడ కూడా భారత్‌దే పైచేయి కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన 31 మ్యాచ్‌ల్లో భారత్ 19 సార్లు విజయాన్ని చవిచూడగా, ఆస్ట్రేలియా 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కాగా, 1 మ్యాచ్ ఫలితం లేకుండానే ముగిసింది.
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. కోహ్లి 22 మ్యాచ్‌ల్లో 794 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 8 అర్ధ సెంచరీలు కూడా చేశాడు. అదే సమయంలో, ఆస్ట్రేలియాపై 13 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన జస్ప్రీత్ బుమ్రా అత్యధికంగా 16 వికెట్లు తీశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..