T20 ప్రపంచ కప్ 2022 ఆస్ట్రేలియాలో నిర్వహించనున్నారు. ఇది ప్రారంభం కావడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు టీ20 వరల్డ్‌కప్-2022 ఈవెంట్ జరుగనుంది. తాజాగా టీ20 ప్రపంచకప్ 2022 ప్రైజ్ మనీని ఐసీసీ ప్రకటించింది. ఈసారి ప్రపంచకప్ గెలిచిన జట్టు 13 కోట్ల రూపాయలను అందుకోబోతోంది. ఇందులో విజేతగా నిలిచిన జట్టుకు 1,600,000 అమెరికన్ డాలర్లు(భారత కరెన్సీలో 13.05 కోట్ల రూపాయలు), ఓడిన జట్టుకు 800,000 అమెరికన్ డాలర్లు(భారత కరెన్సీలో 6.52 కోట్ల రూపాయలు) దక్కనున్నాయి.
ఈ మేరకు ఐసీసీ ఓ ట్వీట్ చేసింది. 2022 టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌లో గెలిచిన జట్టుకు దాదాపు రూ.13 కోట్లు ఇవ్వనున్నారు. అలాగే ఫైనల్‌లో ఓడిన జట్టుకు రూ.6.52 కోట్లు లభించనున్నాయి. సెమీస్‌లో ఓడిన జట్టుకు కూడా భారీగానే అందనుంది. ఇందులో ఓడిన జట్టుకు రూ.3.26 కోట్లు ఇవ్వనున్నారు.
టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 12లో గెలిచిన జట్టుకు రూ.32 లక్షలు బహుమతిగా ఇవ్వనున్నారు. సూపర్ 12 నిష్క్రమణతో జట్టుకు రూ. 57 లక్షలు లభిస్తాయి. మరోవైపు మొదటి రౌండ్‌లో గెలిచి నిష్క్రమిస్తే రూ.32 లక్షలు అందనున్నాయి.
ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2022 ప్రైజ్ మనీ వివరాలు..
విజేతకు – రూ. 13 కోట్లు
రన్నరప్ జట్టుకు – రూ.6.52 కోట్లు
సెమీఫైనల్‌లో ఓడిపోయిన జట్టుకు – రూ. 3.26 కోట్లు
సూపర్ 12లో విజయం సాధించిన జట్టుకు- రూ. 32 లక్షలు
సూపర్ 12 నుంచి ఓడిన జట్టుకు- రూ. 57 లక్షలు
మొదటి రౌండ్‌లో విజయం సాధించిన జట్టుకు – రూ. 32 లక్షలు
మొదటి రౌండ్ నుంచి తప్పుకుంటే – రూ. 32 లక్షలు
Prize money for the ICC Men’s #T20WorldCup 2022 revealed ?
— ICC (@ICC) September 30, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..