T20 World Cup 2021: కొన్నిసార్లు సూర్యోదయం కాస్త ఆలస్యం కావొచ్చు.. వార్నర్‎పై ప్రశంసలు కురిపించిన మాజీ క్రికెటర్..

|

Nov 16, 2021 | 12:57 PM

ఇటీవల ముగిసిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2021లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అద్భుతంగా ఆడాడని భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సోమవారం ప్రశంసల వర్షం కురిపించాడు. అక్టోబర్‌లో పేలవమైన ఫామ్ కారణంగా ఐపీఎల్ జట్టు నుంచి అతడిని తొలగించిన తర్వాత వార్నర్ అసాధారణమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు...

T20 World Cup 2021: కొన్నిసార్లు సూర్యోదయం కాస్త ఆలస్యం కావొచ్చు.. వార్నర్‎పై ప్రశంసలు కురిపించిన మాజీ క్రికెటర్..
Warner
Follow us on

ఇటీవల ముగిసిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2021లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అద్భుతంగా ఆడాడని భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సోమవారం ప్రశంసల వర్షం కురిపించాడు. అక్టోబర్‌లో పేలవమైన ఫామ్ కారణంగా ఐపీఎల్ జట్టు నుంచి అతడిని తొలగించిన తర్వాత వార్నర్ అసాధారణమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ టీ20 వరల్డ్ కప్‎లో 289 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో
కీలక పాత్ర పోషించి జట్టుకు విజయాన్ని అందించాడు. అతను ఫైనల్‎లో 38 బంతుల్లో 53 పరుగులు చేశాడు. వార్నర్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గెలుచుకున్నాడు.

“క్రీడలను కూడా జీవితంలో లాగా ఎప్పుడూ వదులుకోవద్దు. కేవలం కొన్ని వారాల్లో, డేవిడ్ వార్నర్ ఫామ్‎లోకి వచ్చాడు. కొన్నిసార్లు సూర్యోదయం కాస్త ఆలస్యం అవుతుంది” అని కైఫ్ ట్వీట్ చేశాడు. రాశాడు. వార్నర్ అక్టోబర్‌లో పేలవమైన ఫామ్ కారణంగా అతని ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టులోకి ఎంపిక చేయలేదు. అతను ఐపీఎల్ 2021 సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌ల్లో అతను 195 పరుగులు చేశాడు. టీ20 లీగ్ ఎడిషన్‌లో వార్నర్ 500 కంటే తక్కువ పరుగులు చేయడం ఏడేళ్ల తర్వాత ఇదే తొలిసారి.

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‎లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండా నిర్ణిత 20 ఓవర్లలో 172 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 48 బంతుల్లో 85 పరుగులు చేశాడు. ఆసీసి బౌలర్లలో స్టార్క్, కమ్మిన్స్ రెండేసి వికెట్లు పడగొట్టారు. 173 పరుగులు విజయంలక్ష్యంతో బరిలోకి దిగిన కంగారులు మొదట్లోనే వికెట్ కోల్పోయారు. కానీ తర్వాత వచ్చిన మిచెల్ మార్ష్ చెలరేగి ఆడాడు. మార్ష్ 50 బంతుల్లో 77 రన్స్ చేసి నాటౌగా నిలిచి ఆస్ట్రేలియాకు తొలి టీ20 వరల్డ్ కప్ అందించాడు.

Read Also.. KL Rahul: ద్రవిడ్‎తో కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నాను.. వైస్ కెప్టెన్సీ ఒక బాధ్యత..

Hardik Pandya: ఎయిర్‎పోర్ట్‎లో హార్దిక్ పాండ్యాకు షాక్.. అడ్డుకున్న కస్టమ్స్​ అధికారులు.. ఎందుకంటే..

Rashid Khan: కేన్ మామ.. వార్నర్ కాకా.. వైరల్ అవుతోన్న రషీద్ ఖాన్ ట్వీట్..