T20 world cup 2021: అరుదైన ఘనత సాధించిన మహ్మద్ రిజ్వాన్.. ఒకే సంవత్సరంలో 1000 పరుగులు చేసి ఆటగాడిగా రికార్డు..

|

Nov 11, 2021 | 9:31 PM

ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో మహ్మద్ రిజ్వాన్ ఒక సంవత్సరంలో 1000 అంతర్జాతీయ టీ20 పరుగులు చేసి రికార్డును సృష్టించాడు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్‌ అతను ఘనత సాధించాడు...

T20 world cup 2021: అరుదైన ఘనత సాధించిన మహ్మద్ రిజ్వాన్.. ఒకే సంవత్సరంలో 1000 పరుగులు చేసి ఆటగాడిగా రికార్డు..
Rizwan
Follow us on

ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో మహ్మద్ రిజ్వాన్ ఒక సంవత్సరంలో 1000 అంతర్జాతీయ టీ20 పరుగులు చేసి రికార్డును సృష్టించాడు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్‌ అతను ఘనత సాధించాడు. ఈ ఏడాది టీ20లో 826 పరుగులు చేసిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం తర్వాతి స్థానంలో ఉన్నాడు. 1902లో, క్లెమ్ హిల్ టెస్టుల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000 పరుగులు చేసిన రికార్డు సృష్టించాడు. 1983లో డేవిడ్ గవార్ ఒక సంవత్సరంలో 1000 వన్డే పరుగులు సాధించాడు. ఇప్పుడు టీ20ల్లో ఈ రికార్డు రిజ్వాన్ పేరు మీదు రికార్డులకెక్కింది. మహ్మద్ రిజ్వాన్ మిడిల్ ఆర్డర్‌లో ఆడుతున్నప్పుడు 6 సంవత్సరాల్లో ఒక్క టీ20 ఫిఫ్టీ కూడా లేదు. తొలి 10 టీ20 మ్యాచ్‌ల్లో రిజ్వాన్ 106 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఇప్పుడు రిజ్వాన్ ఏడాదిలో 1000 టీ20 పరుగులు చేశాడు.

దీంతో పాటు బాబర్ అజామ్‌తో కలిసి మహ్మద్ రిజ్వాన్ ప్రపంచ రికార్డు కూడా సృష్టించాడు. సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ఇద్దరు బ్యాట్స్‌మెన్ 71 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ టోర్నమెంట్‌లో ఇద్దరూ కలిసి 402 పరుగులు జోడించారు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఏ జోడి ఆటగాళ్లు నమోదు చేసిన ప్రపంచ రికార్డు ఇదే. మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం 21 ఇన్నింగ్స్‌ల్లో 1240 పరుగులు జోడించారు. వీరిద్దరి మధ్య 5 సెంచరీల భాగస్వామ్యాలు ఉన్నాయి. ఇది కాకుండా, ఇద్దరూ 4 అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు కూడా చేశారు.

Read Also.. T20 World Cup 2021: జట్టు మొత్తం సంబురాలు చేసుకుంటుంది.. అతడు మాత్రం ప్రశాంతంగా కూర్చున్నాడు..

T20 World Cup 2021: అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బాబర్‌ అజమ్‌.. కోహ్లీని సైతం వెనక్కి నెట్టి మరీ..