IND vs PAK: ముగ్గురు కోచ్‌ల మూకుమ్మడి విజయం.. ఎట్టకేలకు పాకిస్తాన్‌ని గెలిపించేసారుగా..

|

Oct 25, 2021 | 11:30 AM

IND vs PAK: టీ 20 వరల్డ్ కప్‌ 2021లో భారత్ అరంగేట్రం ఓటమితో మొదలైంది. పాకిస్థాన్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లోనే నిరాశపరిచింది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో

IND vs PAK: ముగ్గురు కోచ్‌ల మూకుమ్మడి విజయం.. ఎట్టకేలకు పాకిస్తాన్‌ని గెలిపించేసారుగా..
Ind Vs Pak
Follow us on

IND vs PAK: టీ 20 వరల్డ్ కప్‌ 2021లో భారత్ అరంగేట్రం ఓటమితో మొదలైంది. పాకిస్థాన్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లోనే నిరాశపరిచింది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 20 ఓవర్లలో151 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ లక్ష్యం పాకిస్థాన్‌కి చాలా చిన్నదని నిరూపించింది. బాబర్ అజామ్ జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా విజయం సాధించింది. బాబర్ అజమ్, మొహమ్మద్ రిజ్వాన్ 152 పరుగులు చేసి పాకిస్తాన్‌కు మరపురాని విజయాన్ని అందించారు. పాకిస్తాన్ మొదటిసారి ప్రపంచకప్‌లో భారతదేశాన్ని ఓడించింది. అయితే ఈ విజయానికి పాకిస్తాన్ ఆటగాళ్లతో పాటు జట్టు కోచింగ్ సిబ్బంది కూడా సహకరించారు.

టీ 20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్ కోచింగ్ సిబ్బంది మొత్తం మారారు. మిస్బా-ఉల్-హక్, వకార్ యూనిస్ పాకిస్తాన్ వెళ్లిపోయిన తరువాత టీ 20 ప్రపంచ కప్ కోసం మాజీ ఆఫ్ స్పిన్నర్ సక్లెయిన్ ముస్తాక్‌కి కోచ్‌ బాధ్యతను పీసీబీ అప్పగించింది. అంతేకాదు బ్యాటింగ్, బౌలింగ్ ప్రత్యేక కోచ్‌లను నియమించారు. మాథ్యూ హేడెన్ పాకిస్థాన్ జట్టులో బ్యాటింగ్ కోచ్‌గా చేరారు. బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ వెర్నాన్ ఫిలాండర్‌ చేరారు.

సక్లైన్ ముస్తాక్‌ని ప్రధాన కోచ్‌గా నియమించడం పాకిస్తాన్‌కి ప్రయోజనకరంగా మారింది. ఎందుకంటే ఇంగ్లండ్ లాంటి జట్టుకి బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. సక్లెయిన్‌కు భారత క్రికెట్ గురించి కూడా బాగా తెలుసు. అతనితో పాటు పాకిస్థాన్‌కు బ్యాటింగ్ కోచ్ మాథ్యూ హేడెన్ కూడా సహకరించాడు. ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేసిన విధానాన్ని నేర్పాడు. ఫలితంగా పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లో అద్భుతమైన బ్యాటింగ్ చేశారు.

వెర్నాన్ ఫిలాండర్ టెస్ట్‌లలో అద్భుతమైన బౌలింగ్‌ చేసిన ఆటగాడు. ఈ ఆటగాడికి కొత్త బంతిలో ఎలా బౌలింగ్‌ చేయాలో బాగా తెలుసు. ఇప్పుడు కోచ్‌గా మారిన తర్వాత ఫిలాండర్ పాకిస్తానీ ఫాస్ట్ బౌలర్లకు కొత్త బంతిని ఉపయోగించడాన్ని నేర్పించాడు. ఫలితంగా షహీన్ అఫ్రిది ప్రదర్శన భారత్‌ని దెబ్బతీసింది. ముఖ్యమైన 3 వికెట్లు తీశాడు. మ్యాచ్ పరిస్థితిని మార్చివేశాడు.

Ind Vs Pak: పాకిస్తాన్‎ జట్టుపై ప్రశంసలు కురిపించిన పాక్ ప్రధాని.. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపు..

First Election in India: మన దేశంలో తొలి ఓటు పడింది ఈరోజే.. తొలిసారి ఎన్నికలు ఎలా నిర్వహించారో తెలుసా?

Chandrababu Delhi Tour: ఢిల్లీ పెద్దల వద్దకు ఏపీ పంచాయితీ.. నేడు హస్తినకు చంద్రబాబు.. రాజకీయ పరిస్థితులపై ఫిర్యాదు