Viral Photos: ఇలాంటి బౌలింగ్ ఎప్పుడైనా చూశారా..? ట్విట్టర్లో మంటలు పుట్టిస్తోన్న మెంటార్ సింగ్ ధోని ఫొటోలు..!

MS Dhoni: పాకిస్తాన్‌పై టీ 20 వరల్డ్ కప్ ప్రారంభోత్సవానికి ముందు నెట్‌ షెషన్‌లో సైడ్‌ఆరమ్‌తో ఎంఎస్ ధోనీ బౌలింగ్ చేస్తున్న ఫోటోలను బీసీసీఐ పంచుకుంది. దీంతో తాలా నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నాడు.

Viral Photos: ఇలాంటి బౌలింగ్ ఎప్పుడైనా చూశారా..? ట్విట్టర్లో మంటలు పుట్టిస్తోన్న మెంటార్ సింగ్ ధోని ఫొటోలు..!
T20 Worl Cup 2021, Dhoni Bowling

Edited By:

Updated on: Oct 23, 2021 | 1:25 PM

T20 World Cup 2021, Ind vs Pak: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని క్రికెట్ మైదానంలో అడుగుపెట్టి హృదయాలను గెలుచుకోని రోజు లేదు. గత 15 సంవత్సరాలుగా, ధోని దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ఇష్టపడే క్రికెటర్లలో ఒకడిగా మారాడు. ప్రస్తుతం టీమిండియా మెంటార్‌గా చేరిన ధోని, శుక్రవారం ఇండియా నెట్స్‌లో సైడ్‌ఆరమ్‌తో బౌలింగ్ చేస్తున్న చిత్రాలను బీసీసీఐ నెట్టింట్లో పంచుకుంది. దీంతో సోషల్ మీడియాలో తాలా తెగ సందడి చేస్తున్నాడు.

ఈమేరకు కొందరు నెటిజన్లు ‘ప్రతి విషయంలో ధోని నిపుణుడు’ అని కామెంట్లు చేస్తున్నారు. ఆస్ట్రేలియాతో భారత్ వార్మప్ గేమ్‌లో రిషబ్ పంత్‌కి వికెట్ కీపింగ్‌లో చిట్కాలు చెప్పిన ధోని, ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి ప్రాక్టీస్ గేమ్‌కు ముందు ఇషాన్ కిషన్‌కు మార్గనిర్దేశం చేశాడు. ప్రస్తుతం నెట్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్లకు సైడ్ఆరమ్‌తో బౌలింగ్ చేస్తూ కనిపించాడు.

బీసీసీఐ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లోకి వెళ్లి, “స్లింగర్” తో ధోని బౌలింగ్ చేస్తున్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. “టీమిండియా లెటెస్ట్ త్రోడౌన్ స్పెషలిస్ట్‌ను చూశారా!” అంటూ క్యాప్షన్ అందించింది. ఊహించినట్లుగానే ఈ ఫొటోలు అభిమానుల హృదయాలను దొచుకున్నాయి. ధోని పట్ల వారి ప్రేమ, ప్రశంసలను చూపించి, భారీ సంఖ్యలో కామెంట్లు చేశారు.

చెన్నై సూపర్ కింగ్స్‌తో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2021) టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత, ధోని భారత జట్టులో మెంటార్‌గా చేరిన విషయంత తెలిసిందే. మెంటార్‌గా డ్యూటీలో చేరినప్పటి నుంచి నిరంతరం సేవలు అందిస్తోన్న ధోనీని చూసి మాజీలు ప్రసంశల జల్లులు కురిపిస్తున్నారు.

విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత్ అక్టోబర్ 24 ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్‌తో తమ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో వార్మప్ మ్యాచ్‌లలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టీంలను ఓడించి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. ఇంగ్లండ్‌ని 7 వికెట్ల తేడాతో ఓడించగా, ఎనిమిది వికెట్ల తేడాతో ఆసీస్‌ను అధిగమించారు.

Also Read: AUS vs SA T20 World Cup 2021 Match Prediction: దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య తొలిపోరు.. ఎవరి బలాలు ఎలా ఉన్నాయంటే?

T20 World Cup: టీ 20 ప్రపంచకప్‌తో అరంగేట్రం చేసిన టీమిండియా క్రికెటర్లు.. ప్రస్తుత టీంలో ఎంతమంది ఉన్నారో తెలుసా?