T20 World Cup: ‘చరిత్రను తిరగరాస్తాం.. ఎట్టి పరిస్థితుల్లో టీమిండియాను ఓడిస్తాం’: పాక్ కెప్టెన్

|

Oct 23, 2021 | 9:41 PM

ఐసీసీ టీ20 వరల్డ్​ కప్​ చరిత్రలో టీమ్ఇండియాను పాకిస్తాన్​ ఓడించలేదు. కానీ, ఆ రికార్డును ఆదివారం జరిగే మ్యాచ్​తో తిరగరాస్తామని..

T20 World Cup: చరిత్రను తిరగరాస్తాం.. ఎట్టి పరిస్థితుల్లో టీమిండియాను ఓడిస్తాం: పాక్ కెప్టెన్
Babar Azam
Follow us on

ఐసీసీ టీ20 వరల్డ్​ కప్​ చరిత్రలో టీమ్ఇండియాను పాకిస్తాన్​ ఓడించలేదు. కానీ, ఆ రికార్డును ఆదివారం జరిగే మ్యాచ్​తో తిరగరాస్తామని పాక్​ కెప్టెన్​ బాబర్​ అజామ్ ధీమా వ్యక్తం చేశాడు. మరికొద్ది గంటల్లో ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా ఈ మ్యాచ్ జరగనుండగా.. దీని కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. అలాగే ఈ మ్యాచ్​పై ఇరు దేశాల క్రికెట్​ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్​లో విజయం తమదే అంటూ ఇరు జట్లు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో జరిగిన వరల్డ్​ కప్​లను పరిశీలిస్తే పాకిస్తాన్​ టీమ్​పై ఇండియా జట్టే ఆధిపత్యం చలాయించింది. అయితే అది గతం అని అంటున్నాడు పాక్​ కెప్టెన్​ బాబర్​ అజామ్​. గతాన్ని తాము మార్చబోతున్నామంటూ చెబుతున్న బాబర్​ అజామ్​.. ఈ మ్యాచ్​లో టీమ్ఇండియాపై పాకిస్తాన్ తప్పక విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

“టీ20 ప్రపంచకప్​లో భారత్​తో జరగనున్న మ్యాచ్​ను మేము ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాం. మా ఇరు జట్ల మధ్య పోటీ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. టీ20 ప్రపంచకప్​ చరిత్రలో ఇప్పటి వరకు మా జట్టు టీమ్ఇండియాను ఓడించలేదు. కానీ, అది గతం. ఇప్పుడు మేము దాన్ని తిరగరాయబోతున్నాం. అక్టోబరు 24న (ఆదివారం) జరగనున్న మ్యాచ్​లో విజయం మాదే. ఒత్తిడిలోనూ ఎలా ఆడాలి అనే దానిపై ప్రణాళికలను రచించాం. ఈ మ్యాచ్​లో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు మైదానంలో నియంత్రణ కోల్పోరని ఆశిస్తున్నా. టీమ్ఇండియాపై విజయం సాధించేందుకు స్పిన్నర్లతో బరిలో దిగనున్నాం. ఈసారి కచ్చితంగా విజయం సాధిస్తాం” అని పాకిస్తాన్​ టీమ్ కెప్టెన్​ బాబర్​ అజామ్​ అన్నాడు.

చివరగా భారత్- పాకిస్తాన్ జట్లు న్యూజిలాండ్‌లో జరిగిన వరల్డ్‌ కప్‌లో భాగంగా 2019 జూన్‌ 16న తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ 89 రన్స్‌ తేడాతో పాకిస్తాన్ జట్టుపై గెలిచింది. దాదాపు రెండేళ్లుగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగకపోవటం.. ఈ సారి తలపడటం… అది కూడా పొట్టి ప్రపంచకప్‌లో దాయాది దేశాల మధ్య సమరం జరగటం.. క్రికెట్ అభిమానులకు పండగే అని చెప్పాలి. ఇక హిస్టరీ పరంగా చూస్తే.. ఇప్పటి వరకు ఇండియా – పాకిస్తాన్ జట్లు ఏడు సార్లు ప్రపంచక‌ప్‌లో తలపడ్డాయి. వీటిలో 5 మ్యాచ్‌లు టీ20 వరల్డ్ కప్​లు కాగా.. నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ గెలుపొందగా.. ఒక మ్యాచ్ రద్దు అయింది. ప్రపంచక‌ప్‌లో ఏడూ సార్లు తడబడిన అన్ని మ్యాచుల్లో భారత్‌దే పై చేయిగా నిలిచింది.. ఈ సారి ఎలా అయిన హిస్టరీని తిరగ రాయలని పాకిస్తాన్ జట్టు వ్యూహాలు రచిస్తుంటే.. భారత్ మాత్రం ఈ సారి కూడా ఆధిపత్యం మాదే అంటూ దీమాగా ఉంది.