T20 Blast: ఐపీఎల్ అంటే పరుగుల వర్షమని మనందరికీ తెలుసు. అయితే ఇంగ్లాండ్‌కి చెందిన ఓ బ్యాటర్ ఐపీఎల్‌లో కురిపించాల్సిన వర్షాన్ని తమ దేశంలో పడేలా చేశాడు. అవును, ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్ టోర్నీలో గ్లామోర్గాన్ జట్టు తరఫున ఆడుతున్న 37 ఏళ్ల వికెట్ కీపర్-బ్యాటర్ క్రిస్ కుక్.. మిడిల్‌సెక్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత సెంచరీ సాధించాడు. అంతేనా.. 41 బంతుల్లో 275 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి, 7 సిక్సర్లు, 12 బౌండరీలతో 113 పరుగులు చేశాడు. అతనే కాదు, తన టీమ్ మేట్ కొలిన్ ఇంగ్రామ్ కూడా 66 బంతుల్లో 92 పరుగులతో అజేయంగా నిలిచాడు.
1️⃣1️⃣3️⃣* in all its glory ???#OhGlammyGlammy pic.twitter.com/0Z9roJ1UEr
ఇవి కూడా చదవండి— Glamorgan Cricket ? (@GlamCricket) May 31, 2023
గ్లామోర్గాన్ జట్టు తరఫున క్రిస్ కుక్(113), కొలిన్ ఇంగ్రామ్(92 నాటౌట్) రాణించడంతో ఆ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. అలా 239 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మిడిల్‌సెక్స్ కూడా తీవ్రంగా ప్రయత్నించింది. మిడిల్‌సెక్స్ తరఫున జో క్రాక్‌నెల్ 42 బంతుల్లో 77 పరుగులు చేయగా, స్టీఫెన్ 51 బంతుల్లో 91 పరుగులతో అజేయంగా నిలిచాడు. కానీ తమ ఇన్నింగ్స్ ముగిసేసరికి మిడిల్‌సెక్స్ టీమ్ 5 వికెట్లు కోల్పోయి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో గ్లామోర్గాన్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..