Suryakumar Yadav: సూర్యకుమార్‌కు మేజర్ సర్జరీ పూర్తి.. గ్రౌండ్‌లోకి దిగేది అప్పుడే..

టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్‌కు శస్త్రచికిత్స జరిగింది. కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అతను ప్రస్తుతం జర్మనీలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా మేజర్ సర్జరీ పూర్తి చేసుకున్న సూర్య.. తాను కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు.

Suryakumar Yadav: సూర్యకుమార్‌కు మేజర్ సర్జరీ పూర్తి.. గ్రౌండ్‌లోకి దిగేది అప్పుడే..
Suryakumar Yadav

Updated on: Jan 18, 2024 | 11:34 AM

టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్‌కు శస్త్రచికిత్స జరిగింది. కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అతను ప్రస్తుతం జర్మనీలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా మేజర్ సర్జరీ పూర్తి చేసుకున్న సూర్య.. తాను కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఆస్పత్రి బెడ్‌పై ఉన్న తన ఫొటోను షేర్ చేసిన మిస్టర్‌ 360 ప్లేయర్‌.. ‘ శస్త్రచికిత్స జరిగింది. నా ఆరోగ్యం గురించి ఆరా తీసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. త్వరలో పునరాగమనం చేస్తా’ అని రాసుకొచ్చాడు. PTI ప్రకారం, సూర్యకుమార్ పూర్తి ఫిట్‌నెస్ తిరిగి పొందడానికి కనీసం ఒక నెల సమయం పడుతుంది. తద్వారా ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-17 నాటికి పునరాగమనం చేసే అవకాశం ఉంది. అలాగని ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు సూర్య దూరమయ్యే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం.

ఎందుకంటే రాబోయే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి మైదానంలోకి రావాలని సూర్యకుమార్ యాదవ్‌కు బీసీసీఐ సూచించింది. అందుకే ఐపీఎల్‌లో తొలి కొన్ని మ్యాచ్‌ల నుంచి అతడు దూరం కానున్నట్లు సమాచారం. దీని ప్రకారం టీ20 ప్రపంచకప్‌కు ముందు సూర్యకుమార్ యాదవ్ రంగంలోకి దిగడం ఖాయం. అమెరికా, వెస్టిండీస్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో కూడా పాల్గొంటానని టీమిండియా ఆటగాడు ధీమాగా చెబుతున్నాడు.

ఇవి కూడా చదవండి

టీ 20 ప్రపంచ కప్ కు చాలా కీలకం..

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ అనివార్యం. ఎందుకంటే గత రెండేళ్లలో పొట్టి క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడీ మిస్టర్‌ 360 ప్లేయర్‌. సూర్య 57 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలు, 17 అర్ధసెంచరీలు సాధించాడు. 171.55 స్ట్రైక్ రేట్‌తో 2141 పరుగులు చేశాడు. తద్వారా మిడిలార్డర్‌లో తన బలాన్ని పెంచుకునేందుకు సూర్యకుమార్ యాదవ్ పునరాగమనం టీమిండియాకు అనివార్యం. 2024 టీ20 ప్రపంచకప్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ జూన్ 29న బార్బడోస్‌లో జరగనుంది.

సూర్యకుమార్ ట్వీట్..

డేవిడ్ వార్నర్ తో మిస్టర్ 360

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..