
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు చాలా మంది సెలబ్రెటీలు హాజరయ్యారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయఢంకా మోగించిన విషయం తెలిసిందే. టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పాటు విరాట్ కోహ్లీ సెంచరీతో మ్యాచ్ మరింత హైలెట్‌గా మారింది. అయితే ఈ మ్యాచ్‌కు సినీ సెలబ్రెటీలతో పాటు వన్డే టీమ్‌లో లేని టీమిండియా స్టార్ క్రికెటర్లు, యువ క్రికెటర్లు కూడా హాజరై మ్యాచ్‌ను ఎంజాయ్ చేశారు. యంగ్ ప్లేయర్లు తిలక్ వర్మ, అభిషేక్ శర్మ మ్యాచ్‌ను ఆస్వాదించారు.
అలాగే టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ సుకుమార్ హాజరయ్యారు. వీరితో పాటు తెలుగుదేశం పార్టీ నేత, మంత్రి నారా లోకేష్ ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ చూసేందుకు వచ్చారు. ఇక టీమిండియా క్రికెటర్ల నుంచి సూర్యకుమార్ యాదవ్ తన భార్యతో కలిసి వచ్చి ఈ మ్యాచ్‌ను ఎంజాయ్ చేశాడు. కాగా సూర్యకుమార్ యాదవ్ కూర్చున్న వీవీఐపీ గ్యాలరీలో పాకిస్థాన్ సపోర్ట్స్ కూడా కూర్చున్నారు. అందులో ఓ అందమైన అమ్మాయి సూర్య కుమార్ యాదవ్ ముందు వరుసలో కూర్చుంది. ఆమె పక్కన ఇంకో పాకిస్థానీ సపోర్ట్ కూర్చున్నారు. బహుషా అతను ఆ అమ్మాయికి సంబంధించిన వ్యక్తి అయి ఉంటారు.
అయితే ఆ వ్యక్తి సూర్యకుమార్ యాదవ్‌తో ఫొటో కావాలని అడిగితే.. ఆ విషయాన్ని ఆ అమ్మాయి సూర్యకు చెబుతున్న క్రమంలో ఇద్దరు ముచ్చట్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత సూర్య వాళ్లతో సెల్ఫీ దిగడం, ఫొటోకు ఫోజులివ్వడం చేశాడు. అయితే ఆ అమ్మాయితో మాట్లాడుతున్న సమయంలో కెమెరా మెన్ వారిని చూపించాడు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. ఇద్దరూ సరదాగా మాట్లాడుతున్న వీడియోకి కొంతమంది నెటజన్లు సూర్య భాయ్ ఫ్లట్ చేస్తున్నట్లు ఉన్నాడు పాకిస్థానీ ఫ్యాన్‌ను అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఆ అమ్మాయితో మాట్లాడుతున్న సమయంలో వదిన(సూర్యకుమార్ సతీమణి) పక్క లేదు.. ఉంటే మాట్లాడేవాడు కాదులే అంటూ సూర్యపై సరదాగా సెటైర్లు వేస్తున్నారు.
Suryakumar Yadav poses with a Pakistani fan 🇵🇰🇮🇳♥️#INDvsPAK #ChampionsTrophy2025 pic.twitter.com/CUHBhOjWM3
— Ahtasham Riaz (@ahtashamriaz22) February 23, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.