IND vs BAN Hyderabad T20I: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌ను మరో మ్యాచ్ ఉండగానే భారత్ కైవసం చేసుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయంతో భారత జట్టు 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే మూడో, చివరి మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా బంగ్లాదేశ్‌ను క్లీన్ స్వీప్ చేయాలని ఆ జట్టు కన్నేసింది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భారీ రికార్డ్ లిఖించే ఛాన్స్ ఉంది. అతను ఒక విషయంలో లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని బీట్ చేసే ఛాన్స్ ఉంది.
టీ20 ఫార్మాట్‌లో (అంతర్జాతీయ క్రికెట్ + టీ20 లీగ్‌లు) అత్యధిక సిక్సర్లు కొట్టిన పరంగా సూర్యకుమార్ యాదవ్ ఎంఎస్ ధోనిని అధిగమించే అవకాశం ఉంది. అయితే ధోనిని వదిలిపెట్టాలంటే సూర్య భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. సూర్యకుమార్ టీ20 ఫార్మాట్‌లో ఇప్పటివరకు 328 సిక్సర్లు బాదాడు. అదే సమయంలో టీ20 ఫార్మాట్‌లో ధోనీ పేరిట 338 సిక్సర్లు ఉన్నాయి. ధోనీని అధిగమించాలంటే సూర్య 11 సిక్సర్లు బాదాల్సి ఉంటుంది. సూర్య బ్యాటింగ్ చేసే విధానం, ఈ చరిష్మా చేయడం అతనికి పెద్ద విషయం కాదు.
టీ20 ఇంటర్నేషనల్ నుంచి రిటైరైన రోహిత్ శర్మ.. టీ20 ఫార్మాట్‌లో భారత్ తరపున అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు 525 సిక్సర్లు కొట్టాడు. 500 సిక్సర్ల ఫిగర్‌ను అందుకున్న ఏకైక భారతీయుడు కూడా. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ పేరు రెండో స్థానంలో ఉంది. విరాట్ కూడా ఈ ఏడాది టీ20 ఇంటర్నేషనల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 ఫార్మాట్‌లో 416 సిక్సర్లు కొట్టాడు.
టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ పేరు క్రిస్ గేల్. ఈ ఫార్మాట్‌లో గేల్ 1056 సిక్సర్లు కొట్టాడు. ఈ ఫార్మాట్‌లో 1000 సిక్సర్ల గ్రేట్ ఫిగర్‌ని టచ్ చేసిన ప్రపంచంలోని ఏకైక బ్యాట్స్‌మెన్ అతనే. ఆ తర్వాత, 897 సిక్సర్లు కొట్టిన కీరన్ పొలార్డ్ పేరు జాబితాలో రెండో స్థానంలో ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..