Team India: సూర్యకుమార్ షాడో కెప్టెన్సీ..: మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్..

Suryakumar Yadav Captaincy: సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ ఛాయలు కనిపిస్తున్నాయని ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసించాడు. బౌలర్లకు స్వేచ్ఛనిస్తూ, సరైన నిర్ణయాలు తీసుకునే సూర్య నాయకత్వ పటిమ అద్భుతమని పఠాన్ అభిప్రాయపడ్డాడు. 84% విజయ శాతంతో సూర్యకుమార్ టీ20 కెప్టెన్సీ రికార్డులు భారత క్రికెట్‌లోనే అత్యుత్తమం. రాబోయే టీ20 ప్రపంచకప్‌లో సూర్యసేనపై భారతీయులు ఆశలు పెట్టుకున్నారు.

Team India: సూర్యకుమార్ షాడో కెప్టెన్సీ..: మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్..
ముఖ్యంగా, సూర్యకుమార్ యాదవ్ గతంలో అత్యంత విజయవంతమైన టీ20ఐ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మను అధిగమించాడు. అతని కెప్టెన్సీలో, భారత జట్టు 80.65 శాతం మ్యాచ్‌లలో గెలిచింది. రోహిత్ 62 మ్యాచ్‌లలో 50 విజయాలు సాధించగా, టీం ఇండియా 12 మ్యాచ్‌లలో ఓడిపోయింది. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నాడు. సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్సీలో, పాకిస్తాన్ 78.38 శాతం మ్యాచ్‌లలో గెలిచింది.

Updated on: Feb 01, 2026 | 8:56 AM

Suryakumar Yadav Captaincy: టీమ్ ఇండియా టీ20 క్రికెట్‌లో ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ హవా నడుస్తోంది. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అద్భుత విజయాలతో దూసుకుపోతున్న సూర్యకుమార్ యాదవ్ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాడు. అయితే, సూర్య బ్యాటింగ్‌ను చూసి మురిసిపోతారని, అతని అద్భుతమైన కెప్టెన్సీని తగినంతగా గుర్తించడం లేదని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా సూర్య నాయకత్వంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఛాయలు కనిపిస్తున్నాయని పఠాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి.

సూర్య నాయకత్వ శైలి రోహిత్ శర్మను తలపిస్తోందని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. రోహిత్ ఎలాగైతే బౌలర్లకు స్వేచ్ఛనిస్తూ క్లిష్ట సమయాల్లో వారికి అండగా ఉంటాడో, సూర్య కూడా అదే బాటలో నడుస్తున్నాడని చెప్పాడు. సూర్య ఒక బౌలర్ల లీడర్ అని, మైదానంలో అతను చాలా యానిమేటెడ్‌గా ఉంటూ ఆటలో పూర్తిగా నిమగ్నమై ఉంటాడని పఠాన్ పేర్కొన్నాడు. రోహిత్ లాగే జట్టు కోసం సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సూర్య దిట్ట అని పఠాన్ కొనియాడాడు. బౌలర్ల మనోభావాలను అర్థం చేసుకొని ఫీల్డ్ సెట్ చేయడంలో సూర్య చూపిస్తున్న పరిణతి రోహిత్ వారసత్వాన్ని గుర్తు చేస్తోందన్నాడు.

సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ రికార్డులు పరిశీలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక తప్పదు. టీ20లో అతని విన్నింగ్స్ పర్సెంటేజ్ ఏకంగా 84%గా ఉంది. ఇది భారత క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమం. సూర్య కెప్టెన్సీలో భారత్ ఇప్పటివరకు ఆడిన ఏడు బైలాటరల్ సిరీస్‌లోనూ ఓటమి చూడలేదు. 2025 ఆసియా కప్‌ను కూడా అజేయంగా ముద్దాడింది. గతేడాది 21 మ్యాచ్‌ల్లో కేవలం 218 పరుగులు మాత్రమే చేసి బ్యాటింగ్‌లో ఇబ్బంది పడినా కెప్టెన్‌గా మాత్రం టీమ్ ఇండియా విజయ పరంపరను ఎక్కడా ఆపలేదు.

టీ20 వరల్డ్ కప్ 2026 దగ్గరపడుతున్న తరుణంలో సూర్య తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థులకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ప్రస్తుత సిరీస్‌లో వరుసగా పరుగులు చేసి తన పాత మిస్టర్ 360 ఫామ్‌ను ప్రపంచానికి చాటాడు. వరల్డ్ కప్‌నకు ముందు సూర్య పరుగులు చేయడం జట్టుకు చాలా ముఖ్యం. తను కాన్ఫిడెంట్‌గా ఉంటే టీమ్ ఇండియాను ఆపడం ఎవరి తరం కాదని పఠాన్ విశ్లేషించాడు. సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు కేవలం ఒక బ్యాటర్ మాత్రమే కాదు, ఒక అద్భుతమైన కెప్టెన్. రోహిత్ శర్మ నుంచి అందుకున్న నాయకత్వ వారసత్వాన్ని గౌరవిస్తూనే, తనదైన మార్కుతో భారత్‌ను నడిపిస్తున్నాడు. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే వరల్డ్ కప్‌లో సూర్యసేన డిఫెండింగ్ ఛాంపియన్‌గా సత్తా చాటుతుందని కోట్లాది మంది భారతీయులు ఆశిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us