
Royal Challengers Bangalore vs Sunrisers Hyderabad: అబుదాబీ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ‘రైజ్’ అయ్యింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ కోల్పోయి 141 పరుగులు చేసింది కేన్ సేన. అయితే, జట్టు బ్యాటింగ్ ప్రారంభించిన కేసేపటికే వికెట్ కోల్పోయింది. తొలుత కాస్త తడబాటుకు గురై వికెట్ కోల్పోయినా.. ఆ తరువాత ఆర్‌సీబీ జట్టు బౌలర్లకు చుక్కలు చూపించారు. హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌ను నిలువరించేందుకు కోహ్లీ సేన ఎన్ని ప్రయత్నాలు, ప్రయోగాలు చేసినా.. సమర్థవంగా ఎదుర్కొంటూ జట్టు స్కోరును పెంచారు. జాసన్ రాయ్, విలియమ్సన్ కలిసి జట్టు స్కోర్‌ను పెంచారు. ఈ క్రమంలో హర్షల్ పటేల్ వేసిన బౌలింగ్‌లో విలియమ్సన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత క్రీజ్‌లోకి వచ్చిన సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్ బాట పట్టారు. తొలి వికెట్ అభిషేక్ శర్మది కాగా, ఆ తరువాత కేన్ విలియమ్సన్, ప్రియం గార్గ్, జాసన్ రాయ్, అబ్దుల్ సమద్ ఇలా వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. మొత్తానికి నిర్ణీత 20 ఓవర్లకు 141 పరుగులు చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు 142 పరుగుల లక్ష్యాన్ని విధించారు సన్‌రైజర్స్ టీమ్.
ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారనే చెప్పాలి. తొలి వికెట్‌గా అభిషేక్ శర్మను ఔట్ చేసిన దశలో మంచి ఉత్సాహంతో రెచ్చిపోయారు ఆర్‌సీబీ బౌలర్లు. అయితే, ఆ తరువాత జాసన్, విలియమ్స్ కలిసి అడ్డు గోడలా నిలవడంతో కాస్త నిరాశకు గురయ్యారు. ఆ తరువాత హర్షల్ పటేల్ విలియమ్సన్‌ను ఔట్ చేయడంతో పరిస్థితి అంతా తారుమారైంది. మ్యాచ్ అంతా ఆర్‌సీబీ బౌలర్ల చేతిలోకి వెళ్లిపోయింది. కేన్ సేన.. వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. దాంతో 15 ఓవర్లకు కేవలం 107 పరుగులు మాత్రమే చేసిన కేన్ సేన.. 5 వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత కూడా వరుసగా మరో రెండు వికెట్లు కోల్పోయింది. ఈ వికెట్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు పడగొట్టగా.. డేన్ క్రిస్టియన్ చెరో 2, జార్జ్ గార్టన్, చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు. ఇదిలాఉంటే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విసిరిన లక్ష్యాన్ని ఆర్‌సీబీ చేధిస్తుందా? చతికిల బడుతుందా? అనేది చూడాలి.
Also read:
USA on India: భారత దేశ భద్రతా ప్రయోజనాలు చాలా ముఖ్యం.. స్పష్టం చేసిన అమెరికా
Earth: మసకబారిపోతున్న భూమి..! కాలుష్యం కారణంగా భూమిపై మొదలైన పరిణామం..(వీడియో)