
ఐపీఎల్ 2024 సీజన్ ఆరంభంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు వనిందు హసరంగ ఇప్పట్లో బరిలోకి దిగే అవకాశం లేదని తెలుస్తోంది. గాయం కారణంగా కొద్దిరోజుల నుంచి ఆటకు దూరంగా ఉన్న హసరంగ.. ఎస్‌ఆర్‌హెచ్ క్యాంపులో చేరేందుకు మరికొంత సమయం పడుతుందని సమాచారం.
ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌కు లంక తరపున బరిలోకి దిగాడు వనిందు హసరంగ. మొత్తంగా 8 వికెట్లు తీసిన అతడు.. ఈ సిరీస్ అవ్వగానే ఎడమకాలి నొప్పితో తీవ్ర ఇబ్బందిపడ్డాడు. దీంతో శ్రీలంక క్రికెట్ వైద్య బృందం.. అతడి గాయాన్ని పరీక్షించగా.. తగిన చికిత్స కోసం విదేశాలు వెళ్లాలని సూచించారట. ఈ క్రమంలోనే హసరంగ ఇప్పట్లో సన్‌రైజర్స్ క్యాంపులో చేరే సూచనలు కనిపించట్లేదు.
మరోవైపు 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున వనిందు హసరంగ 7.54 ఎకానమీతో 26 వికెట్లు తీశాడు. అయితే మరుసటి సంవత్సరం అతడు పేలవ ప్రదర్శన చూపించడంతో.. 2024 వేలంలోకి వచ్చాడు. ఇక ఈ సీజన్ మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అతడ్ని రూ. 1.5 కోట్లతో కొనుగోలు చేసింది. అటు బౌలింగ్ మాత్రమే కాదు.. ఇటు లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ కూడా చేసే సమర్ధుడు హసరంగ. కాగా, ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో 4 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు SRH తన రెండో మ్యాచ్ హైదరాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలబడుతోంది.
𝘼𝙍𝙀 𝙔𝙊𝙐 𝙍𝙀𝘼𝘿𝙔, 𝙊𝙍𝘼𝙉𝙂𝙀 𝘼𝙍𝙈𝙔𝙔𝙔? 🤩
Our first game at Uppal is here! 𝙁𝙄𝙍𝙀 ante ento chupiddamu 🔥#PlayWithFire pic.twitter.com/fX0aBBOQif
— SunRisers Hyderabad (@SunRisers) March 27, 2024